రాజ్యసభలోని భాజపా సభ్యులకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు తప్పనిసరిగా సభలో ఉండాలని, ఆ సమయంలో సభలో చాలా ముఖ్యమైన కార్యకలాపాలు ఉంటాయని అందులో స్పష్టం చేసింది.
ఈ 5 రోజుల వ్యవధిలో ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా ఉండాలని సూచించింది. ఎగువ సభలో కీలక బిల్లులను కూడా ఆమోదించుకోనున్నట్లు భాజపా తెలిపింది.
ఫిబ్రవరి 13నే..
ఈ ఫిబ్రవరి 13నే బడ్జెట్ తొలి విడత సమావేశాలకు ఆఖరు రోజు. ఈ నేపథ్యంలోనే ఎంపీలకు విప్ జారీ చేసింది భాజపా.
కొవిడ్ నేపథ్యంలో రోజూ 5 గంటల పాటే సమావేశాలు సాగుతున్నాయి. ఉదయం 9 నుంచి 2 గంటల వరకు రాజ్యసభ, 4 నుంచి 9 గంటల మధ్య లోక్సభ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.