ETV Bharat / bharat

టార్గెట్​ నితీశ్- త్వరలోనే కేబినెట్​లోకి చిరాగ్!

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి ఎల్​జేపీ ఇచ్చిన షాక్​ అంతా ఇంతా కాదు. అదంతా భాజపా పన్నిన వ్యూహమేనని చాలా వార్తలు వచ్చాయి. అయితే ఎల్​జేపీతో తమకు సంబంధం లేదని ఎన్నికల ముందు భాజపా ప్రకటించినప్పటికీ ఆ పార్టీతో మెతక వైఖరినే ప్రదర్శిస్తోంది. తాజాగా జేడీయూతో కోల్డ్​వార్​ నడుస్తోన్న సమయంలో మరోసారి ఎల్​జేపీతో దోస్తీకి భాజపా సిద్ధమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ 'స్నేహగీతం' నితీశ్​కు చెక్​ పెట్టడానికేనా?

BJP heart still beats for LJP
నితీశ్​కు భాజపా చెక్​- త్వరలోనే కేబినెట్​లోకి చిరాగ్!
author img

By

Published : Jan 1, 2021, 1:23 PM IST

'స్నేహితుడా.. స్నేహితుడా.. రహస్య స్నేహితుడా..' ఇది ఓ సినిమా పాట. అయితే ప్రస్తుతం బిహార్​లో ఎల్​జేపీ-భాజపా మధ్య దోస్తీ ఇలానే కనిపిస్తోంది. బిహార్​ ఎన్నికల సమయంలో ఎల్​జేపీతో 'రాష్ట్రంలో కుస్తీ- కేంద్రంలో దోస్తీ' అన్నట్లు నడిచిన భాజపా ఇప్పుడు స్నేహగీతం ఆలపిస్తోంది. జేడీయూతో ఓవైపు ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోన్న తరుణంలో ఎల్​జేపీకి రాష్ట్రంలో ఎన్​డీఏ గేట్లు తెరిచేందుకు సిద్ధమవుతోంది. ఎల్​జేపీ అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్​ను త్వరలోనే కేంద్ర కేబినెట్​లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. తమపై ధిక్కార స్వరం వినిపిస్తోన్న జేడీయూను దారికి తేవడానికే ఎల్​జేపీని తిరిగి ఎన్​డీఏలోకి భాజపా ఆహ్వానిస్తోందా?

నువ్వే కావాలి..!

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఘోరంగా దెబ్బతినడానికి కారణం ఎల్​జేపీ అన్నది అందిరికీ తెలిసిన విషయమే. జేడీయూను నిలువరించడానికి ఇదంతా భాజపా వేసిన ఎత్తుగడ అన్నది విశ్లేషకుల మాట. ఏనాడూ ఎల్​జేపీని భాజపా విమర్శించకపోవడమూ వారి రహస్య దోస్తీ వార్తలకు బలం చేకూరుస్తోంది.

కేంద్రంలో ఎల్​జేపీ ఇప్పటికీ ఎన్​డీఏలో కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీ బలాబలాలు బట్టి కొన్ని చోట్ల కలిసే ముందుకు వెళ్తున్నాం. బిహార్​లో మాతో జేడీయూ కూటమి కట్టినా ఇతర రాష్ట్రాల్లో విడిగా పోటీ చేస్తోంది. భాజపా-ఎల్​జేపీ బిహార్​లో కలిసి లేకపోయినా కేంద్రంలో దోస్తీ కొనసాగిస్తున్నాయి.

- మృత్యుంజయ్​ ఝా, భాజపా అధికార ప్రతినిధి

ప్రస్తుతం భాజపా నేతల మాటలు చూస్తే ఎల్​జేపీపై ఓ వైపు వైరాన్ని, మరోవైపు ప్రేమను చూపిస్తూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

అంతా మీ వల్లే..

అయితే ఎల్​జేపీకి బిహార్​లో తిరిగి భాజపా స్నేహహస్తం అందించడాన్ని జేడీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఘోర ప్రదర్శనకు ఎల్​జేపీ కారణమని సీఎం నితీశ్​ కుమార్​ సహా జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి బహిరంగంగానే విమర్శించారు. ఇటీవల ముగిసిన పార్టీ జాతీయ కార్యనిర్వహక కమిటీ సమావేశంలోనూ త్యాగి వ్యూహాత్మకంగా మాట్లాడారు.

"ఎల్​జేపీ.. రాష్ట్రంలో, కేంద్రంలో ఎక్కడా ఎన్​డీఏలో భాగస్వామిగా లేదు. ఎల్​జేపీ వల్లే బిహార్​ ఎన్నికల్లో ఎన్​డీఏ మెజారిటీ మార్క్​ దాటడానికి ఇబ్బంది పడింది."

- కేసీ త్యాగి, జేడీయూ ప్రధాన కార్యదర్శి

దివంగత రాం విలాస్​ పాసవాన్ తనయుడైన చిరాగ్​ పాసవాన్​ బిహార్​ ఎన్నికల్లో జేడీయూను ఘోరంగా దెబ్బతీశారు. జేడీయూకు పోటీగా ఎల్​జేపీ అభ్యర్థులను నిలబెట్టడం వల్ల నితీశ్​ పార్టీ 43 స్థానాలకే పరిమితమైంది. ఈ విషయాన్ని జేడీయూ పదేపదే గుర్తుచేస్తోంది.

ఇటీవ అరుణాచల్​ ప్రదేశ్​లో జేడీయూ ఎమ్మెల్యేలు భాజపాలో చేరడంపై నితీశ్​ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఎల్​జేపీని తిరిగి ఎన్​డీఏలోకి భాజపా తీసుకుంటే నితీశ్​ ఏం చేస్తారనేది చూడాలి.

కేబినెట్​లోకి చిరాగ్..

వర్తమాన రాజకీయాల్లో రాంవిలాస్​ పాసవాన్​కు దళిత దిగ్గజంగా పేరుంది. ఆయన కన్నుమూసిన తర్వాత ఎన్​డీఏకు దళితులు దూరం కాకుండా ఉండేలా భాజపా వ్యూహాలు రచిస్తోంది. దళితులకు భాజపా అండగా ఉంది అని తెలిసేలా చిరాగ్​ పాసవాన్​ను​ కేంద్ర కేబినెట్​లోకి తీసుకోవాలని మోదీ యోచిస్తున్నట్లు సమాచారం. అలా చేస్తే అది నితీశ్​కు పెద్ద షాక్​ అని విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పుడు కాదు..

కొద్ది నెలల్లో బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలు వస్తుండటం వల్ల ప్రస్తుతం ఎన్​డీఏలో అలజడి రావడం మంచిది కాదని భాజపా యోచిస్తోంది. ఆ ఎన్నికల అనంతరం ఎల్​జేపీతో తిరిగి జట్టు కట్టే అవకాశం ఉంది.

"భాజపా ఎప్పుడూ జాతీయ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తుంది. అందుకే ఎల్​జేపీని ఇప్పుడు ఎన్​డీఏలోకి తీసుకోదు. అలాకాదు అని తీసుకుంటే ఎన్​డీఏలో అలజడి వస్తుంది. అందుకే ఎల్​జేపీ బిహార్​లో ఎన్​డీఏతో లేదు అని వారు అంటున్నారు. అయితే దళితులకు న్యాయం చేయడం కూడా భాజపాకు పెద్ద సవాలే అన్నది ఎల్​జేపీ అభిప్రాయం."

- సంజయ్​ కుమార్​, రాజకీయ విశ్లేషకుడు

మేం ప్రత్యేకం

ఎల్​జేపీ మాత్రం భాజపాతో దోస్తీపై ఆశాజనకంగానే ఉంది.

"ఎల్​జేపీ- భాజపా బంధం సహజమైంది. జేడీయూలా మేం మహాకూటమి​ నుంచి వచ్చి ఎన్​డీఏలో చేరలేదు. ఎల్​జేపీ ఇచ్చిన షాక్​తో జేడీయూ నేతలకు నిద్దట్లో కూడా పాసవాన్​ కనిపిస్తున్నారు."

- శ్రవణ్​ కుమార్, ఎల్​జేపీ అధికార ప్రతినిధి

మరి బిహార్​లో భాజపా-ఎల్​జేపీ దోస్తీ ఎన్​డీఏలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో, నితీశ్​ ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.