ETV Bharat / bharat

BJP Candidate List 2023 Rajasthan : బీజేపీ రెండో జాబితాలో వసుంధరకు చోటు.. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. గహ్లోత్, పైలట్ స్థానాలు ఇవే - రాజస్థాన్ కాంగ్రెస్ తొలి అభ్యర్థుల జాబితా

BJP Candidate List 2023 Rajasthan : రాజస్థాన్ ఎన్నికల్లో పోటీ చేసే కీలక అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి బీజేపీ, కాంగ్రెస్. 83 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల చేయగా.. 33 మంది నేతలతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది.

bjp candidate list 2023 rajasthan
congress candidate list 2023 rajasthan
author img

By PTI

Published : Oct 21, 2023, 3:18 PM IST

Updated : Oct 21, 2023, 6:26 PM IST

BJP Candidate List 2023 Rajasthan : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించాయి బీజేపీ, కాంగ్రెస్. కీలకమైన నేతలతో కూడిన 83 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. మాజీ ముఖ్యమంత్రి, కీలక నేత వసుంధరరాజె తన సొంత నియోజకవర్గమైన ఝాల్​రాపాటన్ నుంచే పోటీ చేయనున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి భైరన్ సింగ్ షెకావత్ అల్లుడు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నర్పత్ సింగ్ రాజ్వీని చిత్తౌడ్​గఢ్ సీటు నుంచి బరిలో దించింది. మహారాణా ప్రతాప్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవాడ్​కు నాథ్​ద్వారా టికెట్ కేటాయించింది. బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియాను ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమేర్ నుంచే బరిలోకి దించింది. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీ సభాపక్ష నేతగా ఉన్న రాజేంద్ర రాఠోడ్​కు సైతం టికెట్ ఇచ్చింది. రెండో జాబితాతో కలిపి బీజేపీ ఇప్పటివరకు 124 మంది అభ్యర్థులను ప్రకటించినట్లైంది.

  • BJP releases second list of candidates for Rajasthan Assembly elections

    Former CM Vasundhara Raje to contest from Jhalarpatan, Satish Punia fielded from Amber; Rajendra Rathod to contest from Taranagar; Jyoti Mirdha from Nagaur pic.twitter.com/FMzjrujZ4d

    — ANI (@ANI) October 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నర్పత్ సింగ్ రాజ్వీకి టికెట్ కేటాయింపుపై పార్టీలో భిన్నాభిప్రాయాలు నెలకొన్న వేళ.. రెండో జాబితాలో ఆయన పేరు కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నర్పత్ సింగ్ ప్రస్తుతం విద్యాధర్ నగర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలి జాబితాలో ఆయనకు ఈ స్థానాన్ని కేటాయించలేదు. దీంతో రాజ్వీ.. పార్టీ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయనకు చిత్తౌడ్​గఢ్ స్థానాన్ని కేటాయించింది.

కాంగ్రెస్ తొలి జాబితా..
Congress Candidate List 2023 Rajasthan : మరోవైపు, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను అధికార కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 33 మంది అభ్యర్థులకు ఇందులో స్థానం కల్పించింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్​కు సర్దార్​పుర, మరో కీలక నేత సచిన్ పైలట్​కు టోంక్ నియోజకవర్గాన్ని కేటాయించింది. స్పీకర్ సీపీ జోషిని నాథ్​ద్వారా నుంచి బరిలోకి దించింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోస్తారాను లక్ష్మణ్​గఢ్ టికెట్ కేటాయించింది. మంత్రులు హరీశ్ చౌదరి, మమతా భూపేశ్​కు వరుసగా బాయ్​తూ, సిక్​రాయీ(ఎస్సీ) సీట్లను కేటాయించింది.

  • राजस्थान में होने वाले विधानसभा चुनाव, 2023 के लिए भारतीय राष्ट्रीय कांग्रेस द्वारा जारी उम्मीदवारों की पहली सूची। pic.twitter.com/tOyTHUM2TN

    — Congress (@INCIndia) October 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

త్వరలోనే మరిన్ని సీట్లకు..
మెజారిటీ స్థానాలకు కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఆదివారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం మరిన్ని స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 3న వెలువడుతాయి.

మరోవైపు, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 92 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది బీజేపీ. పలు కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అటు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించింది. 30 మందితో కూడిన జాబితాను ఈ మేరకు రిలీజ్ చేసింది. కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు, ఛత్తీస్​గఢ్ రెండో విడత పోలింగ్​కు నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. అక్టోబర్ 30 వరకు నామపత్రాల దాఖలుకు సమయం ఉంటుంది.

Rajasthan Congress Vs BJP : కాంగ్రెస్​పై యువత, మహిళల అసంతృప్తి.. BJPకి లాభం చేకూర్చేనా? మేవాడ్ ఎవరి పక్షం?

Congress MLA Candidate List 2023 : ఎన్నికల సమరానికి కాంగ్రెస్ సై.. మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్​

BJP Candidate List 2023 Assembly Election : బీజేపీ నయా ప్లాన్​.. అసెంబ్లీ ఎన్నికల బరిలో 18 మంది ఎంపీలు

Last Updated : Oct 21, 2023, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.