BJP Candidate List 2023 Assembly Election : త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ వ్యూహాలను రచిస్తోంది. సార్వత్రిక ఎన్నికల సమరానికి సైమీ ఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి నలుగురు కేంద్ర మంత్రులు సహా 18 మంది ఎంపీలను శాసనసభ ఎన్నికల బరిలోకి దింపుతోంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను.. మధ్యప్రదేశ్‌లో రెండు జాబితాలను విడుదల చేసింది. తాజాగా ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించి మరో జాబితాను విడుదల చేసింది. అంతేగాక రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది అధిష్ఠానం.
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే 57 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది బీజేపీ అధిష్ఠానం. ఈ జాబితాలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఉన్నారు. సీఎం శివరాజ్ బుధ్ని నుంచి బరిలోకి దిగుతుండగా.. నరోత్తమ్ మిశ్రా దతియా నుంచి పోటీ చేస్తున్నారు. అంతకుముందు బీజేపీ విడుదల చేసిన జాబితాలో ముగ్గురు కేంద్ర మంత్రులు సహా ఏడుగురు ఎంపీలను శాసససభ ఎన్నికల బరిలోకి దింపింది.
-
BJP releases a list of 57 candidates for the upcoming election in Madhya Pradesh.
— ANI (@ANI) October 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
CM Shivraj Singh Chouhan to contest from Budhni, State's HM Narottam Mishra to contest from Datia, Gopal Bhargava from Rehli, Vishwas Sarang from Narela and Tulsiram Silavat to contest from Sanwer pic.twitter.com/BxnfNqLKg1
">BJP releases a list of 57 candidates for the upcoming election in Madhya Pradesh.
— ANI (@ANI) October 9, 2023
CM Shivraj Singh Chouhan to contest from Budhni, State's HM Narottam Mishra to contest from Datia, Gopal Bhargava from Rehli, Vishwas Sarang from Narela and Tulsiram Silavat to contest from Sanwer pic.twitter.com/BxnfNqLKg1BJP releases a list of 57 candidates for the upcoming election in Madhya Pradesh.
— ANI (@ANI) October 9, 2023
CM Shivraj Singh Chouhan to contest from Budhni, State's HM Narottam Mishra to contest from Datia, Gopal Bhargava from Rehli, Vishwas Sarang from Narela and Tulsiram Silavat to contest from Sanwer pic.twitter.com/BxnfNqLKg1
ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 64 మంది అభ్యర్థులను ప్రకటించగా.. అందులో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్.. రాజ్‌నంద్‌గావ్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే ఎంపీలు రేణుకా సింగ్, గోమతి సాయి కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. మొత్తం బీజేపీ రెండు విడతల్లో విడుదల చేసిన 85 విడుదల చేసిన జాబితాలో ఓ కేంద్ర మంత్రి సహా ముగ్గురు ఎంపీలు ఉన్నారు.
-
BJP releases a list of 64 candidates for the upcoming election in Chhattisgarh. pic.twitter.com/TMQqqjyXJ2
— ANI (@ANI) October 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">BJP releases a list of 64 candidates for the upcoming election in Chhattisgarh. pic.twitter.com/TMQqqjyXJ2
— ANI (@ANI) October 9, 2023BJP releases a list of 64 candidates for the upcoming election in Chhattisgarh. pic.twitter.com/TMQqqjyXJ2
— ANI (@ANI) October 9, 2023
రాజస్థాన్‌లో బీజేపీ తరఫున పోటీ చేసే 41 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. వీరిలో రాజ్‌సమంద్ ఎంపీ దియా కుమారి, జైపుర్ రూరల్ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ సహా ఏడుగురు ఎంపీలు ఉన్నారు. విద్యాధర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దియా కుమారి బరిలోకి ఉండగా.. జోత్వారా నుంచి రాజ్యవర్ధన్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
-
BJP releases a list of 41 candidates for the upcoming election in Rajasthan.
— ANI (@ANI) October 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Rajyavardhan Singh Rathore to contest from Jhotwara, Diya Kumari from Vidhyadhar Nagar, Baba Balaknath from Tijara, Hansraj Meena from Sapotra and Kirodi Lal Meena to contest from Sawai Madhopur. pic.twitter.com/S68CstH35Y
">BJP releases a list of 41 candidates for the upcoming election in Rajasthan.
— ANI (@ANI) October 9, 2023
Rajyavardhan Singh Rathore to contest from Jhotwara, Diya Kumari from Vidhyadhar Nagar, Baba Balaknath from Tijara, Hansraj Meena from Sapotra and Kirodi Lal Meena to contest from Sawai Madhopur. pic.twitter.com/S68CstH35YBJP releases a list of 41 candidates for the upcoming election in Rajasthan.
— ANI (@ANI) October 9, 2023
Rajyavardhan Singh Rathore to contest from Jhotwara, Diya Kumari from Vidhyadhar Nagar, Baba Balaknath from Tijara, Hansraj Meena from Sapotra and Kirodi Lal Meena to contest from Sawai Madhopur. pic.twitter.com/S68CstH35Y
'యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం'
త్వరలో జరగబోయే రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో దిగడంపై బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ స్పందించారు. 'ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేసిన వారిని శాసనసభ ఎన్నికల బరిలో దింపడం వల్ల పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుంది. శాసనసభ ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. రాజస్థాన్ రాజకీయ మార్పు చాలా అవసరం. ' అని పేర్కొన్నారు.
-
#WATCH | On BJP MPs being fielded in the upcoming State elections, party leader Rajyavardhan Singh Rathore says, "A new zeal comes among the workers that a few people who used to work with PM Modi and who PM Modi has seen carefully are being fielded in the Vidhan Sabha election.… pic.twitter.com/jqB161hX83
— ANI (@ANI) October 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | On BJP MPs being fielded in the upcoming State elections, party leader Rajyavardhan Singh Rathore says, "A new zeal comes among the workers that a few people who used to work with PM Modi and who PM Modi has seen carefully are being fielded in the Vidhan Sabha election.… pic.twitter.com/jqB161hX83
— ANI (@ANI) October 9, 2023#WATCH | On BJP MPs being fielded in the upcoming State elections, party leader Rajyavardhan Singh Rathore says, "A new zeal comes among the workers that a few people who used to work with PM Modi and who PM Modi has seen carefully are being fielded in the Vidhan Sabha election.… pic.twitter.com/jqB161hX83
— ANI (@ANI) October 9, 2023
'ఓటర్లు గుణపాఠం చెబుతారు'
రాబోయే మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహరించే వారికి ఓటర్లు గుణపాఠం చెబుతారని అన్నారు కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్‌నాథ్. 'రాష్ట్ర ప్రజలందరూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎన్నికల తేదీలు ఈరోజు ఖరారయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని అపహరించిన వారికి గుణపాఠం చెప్పి రాష్ట్రంలో నిజమైన ప్రభుత్వాన్ని స్థాపించే రోజు ఆసన్నమైంది. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలి.' అని అన్నారు.
Rajasthan Elections 2023 : రాజస్థాన్‌లో సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేక కాంగ్రెస్‌కే జై కొడతారా?