శాసనసభ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అభ్యర్ధుల ఎంపికపై భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ విస్తృతంగా చర్చించింది. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా సహా ఎన్నికల కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే అభ్యర్ధుల ఎంపికపై.. తుది నిర్ణయం తీసుకోలేదు.
అసోంలో కొలిక్కి..
అటు అసోంలో భాజపా, దాని మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం కొలిక్కి వస్తోంది. 86 సీట్లలో పోటీపై భాజపా, అసోం గణపరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఏ పార్టీకి ఎన్నిసీట్లు అనేది వెల్లడికాలేదు. అసోంలో మార్చి 27న తొలి విడత పోలింగ్ జరగనున్న స్థానాల్లో త్వరలోనే అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తామని అసోం రాష్ట్ర భాజపా తెలిపింది.