BJP Appoints Observers In 3 States To Pick New CMs : మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బంపర్ మెజార్టీతో గెలిచిన బీజేపీ ఆ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపికకు కసరత్తును ముమ్మరం చేసింది. సీఎంల ఎంపిక కోసం ప్రత్యేకంగా ఒక్కో రాష్ట్రానికి ముగ్గురు చొప్పున పరిశీలకులను నియమించింది. రాజస్థాన్‌కు, మధ్యప్రదేశ్‌కు, ఛతీస్‌గఢ్‌కు ముగ్గురు చొప్పున మంత్రులు, సీఎంతో కూడిన పరిశీలన బృందాన్ని నియమించింది. మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవి కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం అభ్యర్థి పేరు ప్రకటించకుండానే బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పరిశీలకులు సమావేశమై సీఎం అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక మూడు రాష్ట్రాలకు సంబంధించి కొత్తగా ఎన్నిక కానున్న శాసనసభా పక్ష నేతలు ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించనున్నారు.
రాజస్థాన్ సీఎం ఎంపికకు పరిశీలకులు
- సరోజ్ పాండే
- వినోద్ తావడే
- రాజ్‌నాథ్ సింగ్
మధ్యప్రదేశ్ సీఎం ఎంపికకు పరిశీలకులు
- కే.లక్ష్మణ్
- ఆశా లక్రాను
- మనోహర్ లాల్ ఖట్టర్
ఛత్తీస్‌గఢ్ సీఎం ఎంపికకు పరిశీలకులు
- అర్జున్ ముండా
- సర్భానంద సోనోవాల్
- దుశ్యంత్ కుమార్ గౌతమ్
-
BJP Observers for Chhattisgarh, Madhya Pradesh and Rajasthan decided.
— ANI (@ANI) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Rajasthan - Defence Minister Rajnath Singh, Vinod Tawade and Saroj Pandey
Madhya Pradesh - Haryana CM Manohar Lal Khattar, K Laxman, Asha Lakra
Chhattisgarh - Union Ministers Arjun Munda and Sarbananda Sonowal… pic.twitter.com/lTlrzvNSR6
">BJP Observers for Chhattisgarh, Madhya Pradesh and Rajasthan decided.
— ANI (@ANI) December 8, 2023
Rajasthan - Defence Minister Rajnath Singh, Vinod Tawade and Saroj Pandey
Madhya Pradesh - Haryana CM Manohar Lal Khattar, K Laxman, Asha Lakra
Chhattisgarh - Union Ministers Arjun Munda and Sarbananda Sonowal… pic.twitter.com/lTlrzvNSR6BJP Observers for Chhattisgarh, Madhya Pradesh and Rajasthan decided.
— ANI (@ANI) December 8, 2023
Rajasthan - Defence Minister Rajnath Singh, Vinod Tawade and Saroj Pandey
Madhya Pradesh - Haryana CM Manohar Lal Khattar, K Laxman, Asha Lakra
Chhattisgarh - Union Ministers Arjun Munda and Sarbananda Sonowal… pic.twitter.com/lTlrzvNSR6
-
అగ్రనేతలతో మంతనాలు!
ఇదిలా ఉంటే ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో సీఎం రేసులో ఉన్న పలువురు నేతలు పార్టీ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఈ జాబితాలో ముందున్నారు. శుక్రవారం ఆమె బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు హోంమంత్రి అమిత్ షానూ కలిశారు. రాజేతో పాటు ఇతర ముఖ్య నేతలు మహత్ బాలక్ నాథ్, దియా కుమారి, రాజ్యవరార్ధన్ సింగ్ రాథోడ్ కూడా రాజస్థాన్ సీఎం పదవి కోసం పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఓబీసీ లేదా గిరిజన నాయకుడికి పగ్గాలు?
ఛత్తీస్‌గఢ్‌లో ఓబీసీ లేదా గిరిజన నాయకుడికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని బీజేపీ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అరుణ్ సావో, ఎస్టీ నేతలు లతా ఉసెండి, గోమతి సాయి, రేణుకా సింగ్ వంటి వారు కూడా సీఎం పదవి కోసం చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
సీఎంగా శివరాజ్‌కు మరో ఛాన్స్ దక్కేనా?
మధ్యప్రదేశ్‌లో 'మామా'గా పేరొందిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లింది బీజేపీ హైకమాండ్. ఎందుకో ఆయనపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రజల్లో అనుమానం వచ్చేలా సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయనపై కొన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నట్లు.. ఆయన ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతారనే వార్తలు కూడా వచ్చాయి. అయినా సరే వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ భారీ మెజారిటీతో మరోసారి గెలుపొందారు చౌహాన్.
ఇటీవలే విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 150కుపైగా సీట్లు సాధించింది. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అన్ని రాష్ట్రాల్లో లాగానే ఇక్కడ కూడా సీఎం కుర్చీ కోసం కేంద్రమంత్రులు నరేంద్ర తోమర్, జ్యోతిరాథిత్య సింధియా కూడా పోటీ పడుతున్నారు. అయితే సుదీర్ఘకాలంగా సీఎంగా సేవలందిస్తున్న శివరాజ్‌కే ఈసారి కూడా ముఖ్యమంత్రి పగ్గాలు అప్పజెప్తారా లేదా వేరే వారికి అవకాశం ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
గంటల వ్యవధిలో నాలుగు రాష్ట్రాల్లో భూకంపాలు- రిక్టర్ స్కేల్‌పై తీవ్రత ఎంతంటే?
మిజోరంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం- 9వ సీఎంగా లాల్‌దుహోమా ప్రమాణస్వీకారం