ETV Bharat / bharat

ఒకే ఎన్నికలో తండ్రీకుమార్తెల విజయం..! - బీర్​గావ్​ ఎన్నికలు

Birgaon chunav result 2021: ఛత్తీస్​గఢ్​లో ఓ ప్రత్యేక ఘట్టం అందరిని ఆకర్షించింది. బీర్​గావ్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో వేర్వేరు వార్డుల నుంచి పోటీ చేసిన తండ్రీకుమార్తెలు.. విజయం సాధించారు. తండ్రిలాగే తాను కూడా ప్రజలకు సేవ చేస్తానని కుమార్తె సుశీల పేర్కొన్నారు.

Birgaon chunav result 2021:
ఒకే ఎన్నికల్లో తండ్రీకుమార్తెల విజయం..!
author img

By

Published : Dec 24, 2021, 12:05 PM IST

Birgaon chunav result 2021: ఛత్తీస్​గఢ్​​ బీర్​గావ్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో.. ఓ ప్రత్యేక ఘట్టం ఆవిష్క్రతమైంది. వేర్వేరు వార్డుల నుంచి ఎన్నికల బరిలో దిగిన తండ్రీకుమార్తెలు.. విజయం సాధించారు. కాంగ్రెస్​ టికెట్​ మీద పోటీ చేసిన ఉబరాన్​దాస్​ బంజారే, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన సుశీల మార్కండే గెలుపొందారు. దీంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

Birgaon chunav result 2021
సుశీల, ఉబరాన్​దాస్​

ఈ గెలుపుపై సుశీల మాట్లాడుతూ.. తండ్రిలాగే తాను కూడా ప్రజాసేవ చేస్తానని స్పష్టం చేశారు.

"నా గెలుపు కన్నా మా నాన్న విజయంపైనే నాకు చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి నేను రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. మా నాన్న చాలా సేవ చేస్తారు. రెండుసార్లు కౌన్సిలర్​గా పనిచేసి, ఇప్పుడు మూడోసారి గెలిచారు. ఆయన్ని చూసిన స్థానికులు.. నన్ను కూడా రాజకీయాల్లోకి వెళ్లమని, తండ్రిలా సేవ చేయమని కోరారు. అందుకే నేను పోటీ చేశాను. నాన్న లాగా నేను కూడా సేవ చేస్తాను."

--- సుశీల మార్కండే

Birgaon nagar nigam chunav result: 11వ వార్డు నుంచి పోటీ చేసిన సుశీల.. 3ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో ఆమె ప్రత్యర్థి.. రీకౌంటింగ్​కు డిమాండ్​ చేశారు. రీకౌంటింగ్​ జరిగినా ఫలితం మారలేదు. మూడు ఓట్ల తేడాతో.. పుష్ప గోవింద్​ సాహు.. సుశీల చేతిలో ఓడిపోయారు.

కాంగ్రెస్​కు మేయర్​ పదవి దక్కాలంటే ఇద్దరు స్వతంత్రుల మద్దతు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూతురిని మద్దతివ్వమని కోరారు బంజారే. భర్త, ఇతర కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని సుశీల స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- టీఎంసీదే 'కోల్​కతా' పీఠం.. భాజపాపై దీదీ సెటైర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.