శీతాకాలంలో అతిశీతల వాతావరణం కారణంగా వలస పక్షులతో పాటు, స్థానిక పక్షులు ఆహారం కోసం ఇబ్బంది పడుతుంటాయి. వాటి కష్టాలను చూసిన మహమ్మద్ యాసిన్ అనే వ్యక్తి.. వాటి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అలా తన హౌస్ బోటుకు సమీపంలోనే పక్షుల రిసార్ట్‌ను ఏర్పాటు చేశాడు. పక్షులను రక్షించడంతో పాటు వాటికి ఆహారం అందించాలన్నదే తన ఉద్దేశమని ఈటీవీ భారత్‌కు తెలిపాడు. ప్రకృతికి, పక్షులకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో సరస్సులోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఇక్కడికి ప్రజలు విశ్రాంతి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొండడానికి వస్తుంటారని, వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని యాసిన్ తెలిపాడు.
పక్షులకు శీతాకాలంలో ఆహారం అందించటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, వేసవిలో మాత్రం సమస్య ఎదురవుతుందని యాసిన్ వెల్లడించాడు. వేసవి కాలంలో సరస్సులో నీళ్లు అడుగండటంతో ఆహారం సేకరించడానికి ఇబ్బంది ఎదురవుతుందని చెప్పాడు. చిన్నతనం నుంచే పక్షులకు ఆహారం అందించేవాడినని, కానీ ఈ మధ్యే రిసార్ట్ పెట్టాలనే ఆలోచన వచ్చిందని యాసిన్ తెలిపాడు. పర్యటకులు కూడా పక్షుల రిసార్ట్‌ను చూడటానికి ఆసక్తి కనుబరుస్తున్నారని స్థానికులు చెప్పారు.