దేశంలో 11 రాష్ట్రాలకు 'బర్డ్ ఫ్లూ' విస్తరించినట్లు కేంద్రం వెల్లడించింది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి చెందినట్లు పేర్కొంది.
ఛత్తీస్‌గఢ్‌లోని జీఎస్ పౌల్ట్రీ ఫామ్‌లో బర్డ్‌ఫ్లూ విస్తరించినట్లు పరీక్షల్లో తేలిందని కేంద్ర పాడి పశు సంవర్థక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ రాష్ట్రానికి ముందు.. దిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్‌లలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఖరారైనట్లు వెల్లడించింది.
మధ్యప్రదేశ్‌లోని హర్దా, బర్హాన్పుర్, రాజ్‌గఢ్, దిందోరి, ఛింద్వాడా, మండ్ల, ధార్, సాగర్, సత్నా జిల్లాల్లోని నెమళ్లు, కాకుల్లో బర్డ్‌ఫ్లూ విస్తరించినట్లు శుక్రవారం స్పష్టం చేసింది పశు సంవర్థక శాఖ. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకొని బర్ద్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చూడాలని కేంద్రం కోరింది.
ఇదీ చదవండి:
బర్డ్ ఫ్లూ విసిరిన ఆ రెండు సవాళ్లు