ETV Bharat / bharat

'బిపోర్​జాయ్' బలహీనం​.. గుజరాత్​, రాజస్థాన్​లో భారీ వర్షాలు.. అమిత్​ షా పర్యటన - బిపోర్​జాయ్​ తుపాను పరిస్థితి

Biporjoy Cyclone : గుజరాత్​లో బీభత్సం సృష్టించిన బిపోర్​జాయ్​ తుపాను క్రమంగా బలహీనపడుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి కాస్త బలహీనపడిన తుపాను.. రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడుతుందని చెప్పింది. మరోవైపు, గుజరాత్​, రాజస్థాన్​ రాష్ట్రాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానల ధాటికి నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.

biporjoy cyclone
biporjoy cyclone
author img

By

Published : Jun 17, 2023, 1:01 PM IST

Updated : Jun 17, 2023, 2:21 PM IST

బలహీనపడుతున్న 'బిపోర్​జాయ్'.. గుజారాత్​, రాజస్థాన్​లో భారీ వర్షాలు

Biporjoy Cyclone : గుజరాత్​ను కుదిపేసిన బిపోర్​జాయ్​ తుపాను.. తీరం దాటిన తర్వాత బలహీనపడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడుతుందని చెప్పింది. ఆగ్నేయ పాకిస్థాన్​ వద్ద శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో బలహీనపడిందని చెప్పింది. "బిపోర్​జాయ్​ తుపాను.. జూన్ 16 రాత్రి 11.30 గంటల సమయంలో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఆగ్నేయ పాకిస్థాన్‌ను ఆనుకుని నైరుతి రాజస్థాన్, కచ్​ మీదుగా ధోలవీరాకు ఈశాన్యంగా 100 కి.మీ దూరంలో తుపాను కేంద్రంగా ఉంది. వచ్చే 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుంది" అని ఐఎండీ ట్వీట్​లో తెలిపింది.

Biporjoy Cyclone IMD : "బిపోర్​జాయ్​ తుపాను బలహీనపడుతోంది. ఇది తూర్పు-ఈశాన్య దిశలో కదులుతోంది. దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను కారణంగా గుజరాత్, రాజస్థాన్‌లలో మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫానుతో రుతుపవనాలకు ఎలాంటి సంబంధం లేదు" అని ఐఎండీ డైరెక్టర్​ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు.

  • #WATCH | #CycloneBiporjoy weakened into a deep depression. It is moving in the East-North East direction. Heavy to very heavy rainfall very likely at one or two places over South Rajasthan and adjoining areas of North Gujarat. Due to the cyclone, it is raining only in Gujarat and… pic.twitter.com/Uz4LI4YA9K

    — ANI (@ANI) June 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రైల్వే ముందుజాగ్రత్త చర్యలు.. రైళ్లు రద్దు
Biporjoy Cyclone Trains : అయితే బిపోర్​జాయ్​ తుపాను తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడం వల్ల.. భారత రైల్వే శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది. కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయాలని పశ్చిమ రైల్వే శుక్రవారం నిర్ణయించింది.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అమిత్​ షా పర్యటన
Biporjoy Cyclone Amit Shah : బిపోర్​జాయ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. శనివారం పర్యటించారు. హెలికాప్టర్​ నుంచి తుపానుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో పాటు సీనియర్ అధికారులతో షా సమావేశమయ్యారు.షెల్టర్ హోమ్‌లను కూడా సందర్శించి ప్రజలను కలిశారు. భుజ్‌లోని స్వామి నారాయణ్ ఆలయాన్ని కూడా సందర్శించి.. బాధితులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.

రాజస్థాన్​లో భారీ వర్షాలు..
బిపోర్​జాయ్​ తుపాను కారణంగా రాజస్థాన్​లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మౌంట్ అబులో 210 మిమీ, బార్మర్‌లోని సెద్వాలో 136 మిమీ, జలోర్‌లోని రాణివాడలో 110 మిమీ, చురులోని బిదాసరియాలో 76 మిమీ, రియోదర్‌లో 68 మిమీ, సంచోర్‌లో 59 మిమీ వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 1 మి.మీ నుంచి 22 మి.మీ వరకు వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు.

'ఆస్తి నష్టమే.. ప్రాణ నష్టం లేదు..'
Biporjoy Cyclone Loss : బిపోర్​జాయ్​ తుపాను తీరం దాటే సమయంలో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది తప్ప.. ప్రాణ నష్టం జరగలేదని ఎన్డీఆర్‌ఎఫ్‌ చీఫ్‌ అతుల్‌ కార్వాల్‌.. శుక్రవారం వెల్లడించారు. కచ్‌ ప్రాంతంలో ఇద్దరు మరణించినప్పటికీ.. అది తుఫాను తీరం దాటడానికి ముందే జరిగిందని స్పష్టం చేశారు. కాకపోతే పలు ప్రాంతాల్లో 23 మందికి గాయాలయ్యాయని తెలిపారు.

తుఫాను కారణంగా దాదాపు 800 చెట్లు కూలిపోయాయని, 500 ఇండ్లు దెబ్బతిన్నాయని.. వేల గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. దీని ప్రభావం కచ్‌ జిల్లాలో ఎక్కువగా ఉందని.. దాదాపు 40 శాతం గ్రామాల్లో స్తంభాలు కూలిపోవడం వల్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. ఎన్డీఆర్​ఎఫ్​ తీవ్రంగా శ్రమించి.. పునరుద్ధరించిందని చెప్రారు. తీరం దాటే సమయంలో తుఫాను సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల నష్టం కొంతమేర తగ్గిందని చెప్పారు.

Last Updated : Jun 17, 2023, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.