ETV Bharat / bharat

Biparjoy Cyclone : ఐఎమ్​డీ తీవ్ర హెచ్చరికలు.. మోదీ రివ్యూ మీటింగ్​!.. సురక్షిత ప్రాంతాలకు ప్రజలు.. - భారత వాతవరణ శా ఖ హెచ్చరికలు

Biporjoy Cyclone Gujarat : అరేబియా సముద్రంలో పుట్టుకొచ్చిన 'బిపోర్‌ జాయ్‌' తుపానుగా మారిన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన వేళ​ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. జూన్​ 15 మధ్నాహ్నం నాటికి తీరాన్ని చేరుతుందన్న అంచనాలతో సహాయక చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావంతో ముంబయి ఎయిర్‌పోర్టులోనూ ఆందోళనకర వాతావరణం కనిపిస్తోంది.

biporjoy-cyclone-news-today-imd-issues-cyclone-alert-for-gujarat
బిపోర్‌జాయ్‌ తుపాను
author img

By

Published : Jun 12, 2023, 11:45 AM IST

Updated : Jun 12, 2023, 12:18 PM IST

Biporjoy Cyclone Status : అరేబియా సముద్రంలో ఈ ఏడాది తొలిసారి ఏర్పడిన బిపోర్‌ జాయ్‌ తుపాను.. అతి తీవ్రంగా మారి గుజరాత్‌ వైపు దూసుకొస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను మరో 36 గంటల్లో మరింత బలపడి.. గుజరాత్‌లోని కచ్‌, పాకిస్తాన్‌లోని కరాచీల మధ్య ఈ నెల 15న తీరాన్ని దాటనుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌ తీరప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గుజరాత్‌తో పాటు కర్ణాటక, గోవాల్లోనూ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనూ వర్షాలుండ్చొని అంచనా వేస్తోంది. తుపాను ప్రభావంతో పశ్చిమ తీర ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎమ్​డీ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో గుజరాత్‌ తీరంలో.. అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది. ద్వారక వద్ద రాకాసి అలలు భయపెడుతున్నాయి. కాగా బిపోర్‌జాయ్‌ తుపానుపై.. భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

  • Cyclone Alert for Saurashtra & Kutch Coast: Orange Message. ESCS BIPARJPY at 0530IST of today over eastcentral & adjoining NE Arabian Sea near lat 19.2N & long 67.7E, about 380km SSW of Devbhumi Dwarka. To cross near Jakhau Port,Gujarat by noon of 15June. https://t.co/KLRdEFGKQj pic.twitter.com/bxn44UUVhD

    — India Meteorological Department (@Indiametdept) June 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా తీరంలో కేంద్రీకృతమైన బిపోర్‌ జాయ్​ తుపాను.. గంటకు ఎనిమిది కి.మీల వేగంతో ఈశాన్య దిశగా కదులుతున్నట్లు ఐఎండీ వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో.. గంటకు 135 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని ఐఎమ్​డీ అంచనా వేసింది. గుజరాత్‌ తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువగా కారణంగా జూన్ 15 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని వారు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెల్టర్​లలోకి తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 1,300 మంది తరలించినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా మహారాష్ట్రలోని ఠానే, రాయగఢ్, ముంబయి, పాల్ఘర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 45-55 కి.మీ వేగంతో.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్​డీ వివరించింది.

ముంబయిలో విమానాల రాకపోకలకు ఆటంకం..
బిపోర్‌ జాయ్‌ తుపాను ప్రభావంతో మహారాష్ట్ర రాజధాని ముంబయిలోనూ బలమైన గాలులు వీస్తున్నాయి. సోమవారం అక్కడ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ముంబయి ఎయిర్‌పోర్టులో.. విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. గాలుల తీవ్రత కారణంగా కొన్ని విమానాలను రద్దు కాగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తాయని అధికారులు తెలిపారు. కొన్నింటిని ముంబయి ఎయిర్​పోర్టులో ల్యాండ్‌ చేసే పరిస్థితి లేక మరో ఎయిర్‌పోర్టుకు దారిమళ్లిస్తున్నట్లు వివరించారు. దీంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీనిపై ఎయిర్​ఇండియా ట్విట్టర్‌ ద్వారా అప్‌డేట్ ఇచ్చింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ముంబయి ఎయిర్‌పోర్టులోని 09/27 రన్‌వేను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపిన ఎయిరిండియా.. ఆలస్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇండిగో సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. కాగా గంటల తరబడి ఎయిర్‌పోర్టులోనే వేచి ఉన్న ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సరైన సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 12, 2023, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.