Billionaire Farmer Award 2023 Winner : వ్యవసాయానికి ఆధునిక పద్ధతులు జోడించి విశేష లాభాలు గడిస్తున్న రైతు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. ఏడాదిలో కోటి రూపాయలకు పైగా టర్నోవర్ సాధిస్తున్న కర్ణాటకలోని ఉడుపి జిల్లాకు చెందిన రమేశ్ నాయక్ 'బిలినీయర్ ఫార్మర్ అవార్డు' దక్కించుకున్నారు. ఈ అవార్డును డిసెంబర్ 7న దిల్లీలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా తీసుకోనున్నారు.
ఏటా రూ.కోటి!
కుందాపురలోని తెక్కట్టే ప్రాంతానికి చెందిన రమేశ్ నాయక్‌కు కదూరు ప్రాంతంలో ఉన్న 13 ఎకరాల భూమిలో 11 రకాల జాతులకు చెందిన సుమారు 1,634 పండ్ల చెట్లను పెంచుతున్నారు. వ్యవసాయంపైనే ఏటా కోటి రూపాయల వరకు సంపాదిస్తున్నారు. దీంతో పాటు వారసత్వంగా వచ్చిన రైస్ మిల్లును నడిపిస్తున్నారు.
"1968లో మా నాన్న రైస్ మిల్లును ప్రారంభించారు. నేను 1979 నుంచి మిల్లులో పని చేస్తున్నా. ఆ తర్వాత ఉద్యాన పంటలను పండిచడం మొదలుపెట్టాను. 13 ఎకరాల్లో ఆధునిక పద్ధతుల్లో సేద్యం చేయటం ప్రారంభించాను. వ్యవసాయానికి అనుబంధంగా నడిచే ఓ పండ్ల ఫ్యాక్టరీ నెలకొల్పాం. దీంతో మా వ్యాపారం 10 కోట్ల రూపాయలకు పెరిగింది. దీంతో గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం(జీకేవీకే) బిలియనీర్ ఫార్మర్ రైతు అవార్డుకు సిఫార్సు చేసింది. వ్యవసాయంలో నష్టం వస్తుందని కొంత మంది అంటుంటారు. కానీ శాస్త్రీయంగా సాగు చేస్తే లాభసాటిగా ఉంటుంది" అని రమేశ్ నాయక్ తెలిపారు.
50ఏళ్లుగా టమాటా సాగు.. ఇప్పుడు 'లాభాల పంట'.. నెలలోనే కోటీశ్వరుడిగా మారి..
Tomato Farmer Crorepati : కొన్ని నెలల క్రితం దేశవ్యాప్తంగా టమాటా ధరలు భగ్గుమన్నాయి. అప్పుడు కిలో టమాటా ధర రూ.150 నుంచి రూ.300 వరకు పలికింది. దీంతో అనేక మంది ప్రజలు టమాటాలను కొనుగోలు చేయలేక వాటిని వినియోగించడం ఆపేశారు. ఆ సమయంలో దేశంలో కొందరు రైతులు కోటీశ్వరులుగా మారారు. మార్కెట్లో మంచి ధర పలుకుతుండడం వల్ల వారు భారీ లాభాలను ఆర్జించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఓ రైతుకు ఇలాంటి అదృష్టమే వరిచింది. కోట్లలో సంపాదించాడు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Blind Man Farming : కళ్లు కనిపించకపోయినా వ్యవసాయం.. పంటకు కంచె ఏర్పాటు.. సేద్యం పనులు ఈజీగా..
Tomato Farmer Millionaire : ఎకరంలో టమాటా సాగు.. మూడు నెలల్లోనే లక్షాధికారిగా మారిన రైతు