ETV Bharat / bharat

80ఏళ్ల వయసు.. 14 సబ్జెక్టుల్లో మాస్టర్స్​.. దేశంలోనే తొలి వ్యక్తిగా రికార్డ్​! - ఎస్​వి పురోహిత్

Bilaspur advocate's record feat: ఎనిమిది పదుల వయసులోనూ డిగ్రీలతో దూసుకెళ్తున్నారు ఓ వృద్ధుడు. చదువుకు వయసుతో ఏం సంబంధం అన్నట్లుగా నిత్యవిద్యార్థిగా మారారు. ఆయనే ఛత్తీస్​గఢ్​లోని హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న ఎస్​వీ​ పురోహిత్. గిన్నిస్ బుక్ రికార్డులు, లిమ్కా బుక్​ అవార్డులే తన లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్నారు.

ms purohit
ఎంఎస్ పురోహిత్
author img

By

Published : Mar 26, 2022, 9:06 AM IST

Updated : Mar 26, 2022, 4:06 PM IST

ఎనిమిది పదుల వయసులోనూ డిగ్రీలతో దూసుకెళ్తున్నారు వృద్ధుడు

Bilaspur advocate's record feat: చదువుకు వయసుతో సంబంధం లేదని చాటిచెబుతున్నారు ఓ న్యాయవాది. ఎనిమిది పదుల వయసులోనూ చదువుపై ఉన్న ఆయన మమకారాన్ని వదులుకోవట్లేదు ప్రస్తుతం ఛత్తీస్​గఢ్​లోని బిలాస్​పుర్​ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే.. జ్యోతిషశాస్త్రంలో ఎంఏ చేస్తున్న ఆయన పేరు ఎస్​వీ పురోహిత్. పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, హిందీ, ఇంగ్లీష్, మహాత్మ గాంధీ శాంతి పరిశోధనలు, అనువాదం- ఎడిటింగ్, ఎల్ఎల్​బీ, ఎల్​ఎల్​ఎం, డిప్లొమా ఇన్ సైబర్ లా, పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం వంటి సబ్జెక్ట్స్​లో ఆయన మాస్టర్స్ చేసి అరుదైన ఘనత సాధించారు.

purohit degrees
ఎస్​వీ పురోహిత్ సాధించిన డిగ్రీలు
purohit intrest in education
ఎనిమిది పదుల వయసులోనూ పురోహిత్​కు చదువుపై తగ్గని ఆసక్తి

"1962వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేశా. ఆ తర్వాత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. కానీ అప్పట్లో మా తండ్రి ఆదాయం చాలా తక్కువ. ఇద్దరు పిల్లలను చదివించే స్తోమత లేక ఒకరిని మాత్రమే చదివించేందుకు సిద్ధమయ్యారు. అందుకే మా తమ్ముడిని ఎంబీబీఎస్ చదివించారు. అప్పట్లో కుదరలేదు.. కానీ ఇప్పుడు నేను చివరిదాకా చదువును కొనసాగించాలనుకుంటున్నాను."

- ఎస్​వీ​ పురోహిత్

ప్రస్తుతం 80ఏళ్ల వయసున్న ఎస్​వీ పురోహిత్.. దేశంలోనే 14 సబ్జెక్టుల్లో ఎంఏ చేసిన ఏకైక వ్యక్తి తానేనని చెబుతున్నారు. ఇతర సబ్జెక్టుల్లో 24 డిప్లొమా పట్టాలు పొందినట్లు చెప్పారు. మరోవైపు.. తన తండ్రిపై ప్రశంసలు కురించారు ఆయన పెద్ద కుమారుడు సునీల్​ పురోహిత్​. గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించడమే లక్ష్యంగా తన తండ్రి ముందుకు సాగుతున్నట్లు చెప్పాడు.

ms purohit
పుస్తకాలు చదువుతున్న నిత్యవిద్యార్థి ఎస్​వీ పురోహిత్

"మా నాన్న పుస్తకాల పురుగు. మా తండ్రికి చదవడం ఒక వ్యసనంలా మారిపోయింది. నా తమ్ముడు పంకజ్‌ అమెరికాలో స్థిరపడి.. మా నాన్నగారి కృషిని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్​లో నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు."

-సునీల్ పురోహిత్, ఎస్​వీ పురోహిత్ పెద్ద కుమారుడు

సరస్వతీదేవి ఆశీర్వాదంతోనే అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్నట్లు చెబుతున్న పురోహిత్.. మహాత్మాగాంధీ వ్యక్తిత్వంపై ఎంఏ కూడా చేశారు. తన మరణం వరకు చదువు కొనసాగిస్తానని అంటున్నారు. ఎక్కువ సమయం చదువుకే ఉపయోగిస్తానని చెబుతున్నారు. 'ఈ చదువుల వల్లే నాకు హైకోర్టులో గౌరవం లభిస్తోంది. అక్కడి న్యాయమూర్తులు కూడా నన్ను గుర్తిస్తున్నారు' అని పురోహిత్ పేర్కొన్నారు.

chattisgarh high court
ఛత్తీస్​గఢ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు

ఇదీ చదవండి: 11 నెలలుగా జైలులో ఖైదీ.. అయినా ఐఐటీ పరీక్షలో టాప్ ర్యాంకర్!

Last Updated : Mar 26, 2022, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.