రోడ్లపై విమానం ప్రయాణించడం చూశారా? ఇదేంటి అనుకుంటున్నారా? అవును అలాంటి బైక్ను రూపొందించాడో వ్యక్తి (Desi jugaad video). ఓ వైపు పెట్రోల్ రేట్ల పెరుగుదల.. ఇంకోవైపు బయట ఖర్చులు భరించలేకపోవడం.. అంతే ఏదైనా కొత్తగా సృష్టించాలనుకున్నాడు. విమానం రెక్కల్లా మోటార్ బైక్కు(Bike viral video) చెక్క బల్లలు జోడించి.. వాటిపై తన కుటుంబసభ్యులను కూర్చోబెట్టుకున్నాడు. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 9 మందితో బైక్పై చక్కర్లు కొట్టాడు. ద్విచక్రవాహనాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ.. గ్రామీణ ప్రాంతంలోని ఓ రోడ్డుపై విమానంలా నడిపాడు.
వీడియోను స్పష్టంగా గమనిస్తే.. అందులో ఐదుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నట్లు కనిపిస్తుంది.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవర్ధన్ సింగ్.. సంబంధిత వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
-
सरकार ने पेट्रोल-डीज़ल को आसमान पर पहुचाया तो जनता ने भी नया जुगाड़ हवाई जहाज बना लिया.. pic.twitter.com/YvnjzdS1uP
— Jaivardhan Singh (@JVSinghINC) October 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">सरकार ने पेट्रोल-डीज़ल को आसमान पर पहुचाया तो जनता ने भी नया जुगाड़ हवाई जहाज बना लिया.. pic.twitter.com/YvnjzdS1uP
— Jaivardhan Singh (@JVSinghINC) October 27, 2021सरकार ने पेट्रोल-डीज़ल को आसमान पर पहुचाया तो जनता ने भी नया जुगाड़ हवाई जहाज बना लिया.. pic.twitter.com/YvnjzdS1uP
— Jaivardhan Singh (@JVSinghINC) October 27, 2021
'పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రభుత్వం ఆకాశానికి ఎత్తుతున్నప్పుడు, ప్రజలు కొత్త జుగాద్ విమానాన్ని తయారుచేశారు,' అని క్యాప్షన్ పెట్టారు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైంది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఇదెక్కడి ఐడియారా బాబు అనుకుంటుంటే.. మరికొందరు నవ్వుకుంటున్నారు(Most Funny Video).
అయితే.. ఎవరూ హెల్మెట్ ధరించలేదు. ఇంకా ఒకే బైక్పై (Bike viral video) ఇలా ప్రమాదకరంగా, ఇంత మంది వెళ్లడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
ఇవీ చూడండి: కామాంధుల చెరలో బాల్యం- చర్యలేవి?