Bike Engine From jeep Bihar: బిహార్‌లోని బేతియాలో లోహా సింగ్ అనే మెకానిక్ బైక్ ఇంజిన్‌తో నాలుగు సీట్ల మినీ క్లాసిక్ జీప్‌ను తయారు చేశాడు. 150 సీసీ ఇంజిన్ ఉన్న ఈ జీప్‌లో నలుగురు కూర్చోవచ్చు. ఒక లీటర్ పెట్రోల్‌తో 30 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 10 క్వింటాళ్ల బరువు గల సరకులను తీసుకెళ్లవచ్చు.
లాక్డౌన్ సమయంలో ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించాడు లోహా సింగ్. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు క్లాసిక్ జీప్ తయారు చేయాలనే ఆలోచన అతడికి వచ్చింది. ఈ వాహనాన్ని ఇరుకైన వీధుల్లోనూ నడపగలిగేలా నిర్మించాడు. యూట్యూబ్ సహాయంతో నాలుగు సీట్ల మినీ క్లాసిక్ జీప్‌ను రూపొందించడానికి లోహా సింగ్‌కు 50 రోజులు పట్టింది.
"లాక్డౌన్ సమయంలో ఏ పని లేకుండాఖాళీగా ఉన్నాను. అప్పుడే ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన వచ్చింది. సెకండ్ హ్యాండ్ సీబీజీ బైక్ తీసుకొచ్చాం. దాని ఇంజిన్‌ను వేరు చేశాం. ఆ తరువాత టెంపో భాగాలను తీసుకొచ్చాం. అన్నింటినీ కలిపి ఈ క్లాసిక్ జీప్ తయారుచేశాను. ఈ జీప్ లీటర్ పెట్రోల్‌కు 30 కి.మీ మైలేజ్ ఇస్తుంది."
-లోహా సింగ్, మినీ జీప్ రూపకర్త
ఈ జీప్‌కు మొత్తం 6 గేర్లు ఉన్నాయని.. సెల్ఫ్ స్టార్ట్ చేసుకోవచ్చని లోహా సింగ్ చెబుతున్నాడు. క్లాసిక్ జీప్‌లోని పవర్ టిల్లర్ చక్రాలు.. నీటితో నిండిన రోడ్లపైనా సాఫీగా దూసుకుపోగలవని అంటున్నాడు. ఈ మినీ క్లాసిక్ జీప్‌లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని చెబుతున్నాడు. జీప్ తయారీకి రూ.1.5 లక్షలు ఖర్చయిందని వెల్లడించాడు.
మార్కెట్లో మినీ క్లాసిక్ జీప్‌లకు మంచి డిమాండ్ ఉందని, అందుకే ఇలాంటివి మరిన్ని తయారు చేసి అమ్మాలనే ఆలోచన ఉందని చెబుతున్నాడు లోహా సింగ్. చాలా మంది కస్టమర్లు తాను తయారు చేసిన జీప్‌ను కొనాలనుకుంటున్నారని వెల్లడించాడు. అయితే ఇది తాను రూపొందించిన మొదట జీప్ అని.. అందుకే ఎవరికీ అమ్మడం లేదని చెప్పాడు లోహా సింగ్.
ఇవీ చదవండి: సూపర్ హెయిర్ స్టైలిస్ట్.. ఒకేసారి 28 కత్తెర్లతో కటింగ్