Bihar Reservation Increase : బిహార్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ల కోటా పెంపునకు ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు 50 నుంచి 65 శాతానికి పెరిగాయి. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును బిహార్ ప్రభుత్వం అసెంబ్లీలో గురువారం ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది.
'బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్'
Bihar Special Status : మరోవైపు.. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అసెంబ్లీ వేదికగా కేంద్రాన్ని మరోసారి డిమాండ్ చేశారు సీఎం నీతీశ్ కుమార్. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి మరిన్ని మౌళిక వసతులు వస్తాయని తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల బిహార్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ కోటా పెంపు బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేసారు నీతీశ్ కుమార్. బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.
-
VIDEO | Speaking in the Bihar Assembly, CM @NitishKumar reiterates his party's demand of special status for the state. pic.twitter.com/HuhbSgekbC
— Press Trust of India (@PTI_News) November 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | Speaking in the Bihar Assembly, CM @NitishKumar reiterates his party's demand of special status for the state. pic.twitter.com/HuhbSgekbC
— Press Trust of India (@PTI_News) November 9, 2023VIDEO | Speaking in the Bihar Assembly, CM @NitishKumar reiterates his party's demand of special status for the state. pic.twitter.com/HuhbSgekbC
— Press Trust of India (@PTI_News) November 9, 2023
'కులగణన జరపాలని కేంద్రాన్ని ఇంతకముందే అడిగాం. కానీ కేంద్రం అందుకు అంగీకరించలేదు. అందుకే బిహార్‌లో కులగణన చేశాం. కులగణన ఆధారంగా రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తాం.' అని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ తెలిపారు.
కులాలవారీగా పెరిగిన రిజర్వేషన్లు
ప్రస్తుతం బిహార్‌లో ఎస్టీలకు 1 శాతం రిజర్వేషన్ ఉండగా.. 2 శాతానికి పెరిగింది. అలాగే ఎస్సీ రిజర్వేషన్ 16 నుంచి 20 శాతానికి చేరింది. ఈబీసీలకు గతంలో 18 శాతం రిజర్వేషన్ ఉండగా.. ప్రస్తుతం 25 శాతానికి ప్రభుత్వం పెంచింది. అలాగే ఓబీసీలకు 12 నుంచి 15 శాతానికి పెంచింది. ఈడబ్ల్యూఎస్ కోటా 10 శాతంతో కలిపి అన్ని వర్గాల రిజర్వేషన్లు 50 నుంచి 75 శాతానికి పెరిగాయి.
Nitish Kumar Controversial Comments : ఇటీవల జనాభా నియంత్రణ విషయంలో మహిళల విద్యకు ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ క్షమాపణలు చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
రిజర్వేషన్లు పెంచే దిశగా బిహార్ ప్రభుత్వం అడుగులు- మరికొద్ది రోజుల్లోనే చట్టం!
చెత్త ఏరుకొనే వ్యక్తికి దొరికిన బ్యాగ్- తెరిచి చూస్తే 23 లక్షల అమెరికన్ డాలర్లు!