ETV Bharat / bharat

'మెమొరీ' మ్యాన్ అభయ్​- 3 గిన్నిస్​ రికార్డులు కైవసం- ఒక్క నిమిషంలోనే! - వైశాలి యువకుడు అభయ్​ కుమార్ గిన్నిస్​ రికార్డ్​

Bihar Memory Man Abhay Kumar : 10వేల సంవత్సరాలకు సంబంధించిన 19 క్యాలెండర్​ల తేదీల రోజులను కేవలం ఒక్క నిమిషంలోనే చెప్పి గిన్నిస్​ రికార్డ్​ సాధించాడు బిహార్​ యువకుడు. తన పేరిటే ఉన్న రికార్డును తిరగరాసుకున్నాడు. అతడి గురించి తెలుసుకుందాం రండి.

Vaishali Memory Man Abhay Kumar Broke His Own Record And Entered The Guinness Book Of World Records
Bihar Memory Man Abhay Kumar Guinness Book Of World Records
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 3:31 PM IST

Bihar Memory Man Abhay Kumar : సాధారణంగా గతవారం ఫలానా తేదీ ఏ రోజు వచ్చిందో చెప్పమంటేనే మనం ఫోన్లలో క్యాలెండర్​ను తెరుస్తాం. అలాంటిది ఎటువంటి ఆధారం లేకుండా పది వేల సంవత్సరాలకు సంబంధించి 19 వేర్వేరు క్యాలెండర్​ తేదీలు ఏ రోజు వచ్చాయో కేవలం ఒక్క నిమిషంలోనే చెప్పేశాడు బిహార్​కు చెందిన అభయ్​కుమార్. ఈ మేరకు గిన్నిస్​ బుక్ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించుకున్నాడు.

వైశాలి జిల్లాలోని హాజీపుర్​ ప్రాంతానికి అభయ్​కుమార్​(30) ఈ ఘనత సాధించాడు. తన పేరిట ఉన్న గిన్నిస్​ రికార్డును తానే బద్దలకొట్టాడు. దీంతో అతడి అద్భుతమైన జ్ఞాపకశక్తికి ఆశ్యర్యపోతున్న పలు దేశాల మేధావులు అభయ్​ను అభినందిస్తున్నారు. అభయ్ రెండో సారి​ గిన్నిస్​ బుక్​లో సాధించిన విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్వయంగా తన సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​లో ప్రకటించింది. అభయ్​ తండ్రి సహేంద్ర పాశ్వాన్​ వృత్తిరీత్యా ప్రొఫెసర్​, తల్లి ప్రేమ్​ షీలా కుమారి గృహిణి.

Vaishali Memory Man Abhay Kumar Broke His Own Record And Entered The Guinness Book Of World Records
మైండ్​ అండ్​ మెమోరీ కోచ్​​ అభయ్​ కుమార్

అభయ్​కుమార్​ ఇప్పటి వరకు మూడు గిన్నిస్​ రికార్డులను నెలకొల్పాడు. తొలిసారి 1 నుంచి 10 వేల సంవత్సరాలకు చెందిన 16 క్యాలెండర్​ తేదీల రోజులను కేవలం 1 నిమిషంలోనే చెప్పి రికార్డులోకెక్కాడు. ఆ తర్వాత ఒక్క నిమిషంలోనే 91 దేశాలకు చెందిన పాస్​పోర్ట్​లను గుర్తించి రెండో రికార్డును కైవసం చేసుకున్నాడు. పాస్​పోర్ట్​లపై ఉన్న చిహ్నాల ఆధారంగా 60 సెకన్లలో 91 దేశాలను గుర్తించగలిగాడు అభయ్​. అంతకుముందు ఈ రికార్డు ఒక నిమిషంలో 87 దేశాల పేర్లు చెప్పిన దక్షిణ భారత్​కు చెందిన వ్యక్తి పేరిట ఉండేది. తాజాగా మూడోసారి గిన్నిస్ రికార్డు సాధించాడు.

"2016లో నేను మెకానికల్​ ఇంజినీరింగ్​లో డిగ్రీ పూర్తి చేశాను. అదే సంవత్సరం పాలిటెక్నిక్​ కళాశాలలో లెక్చరర్​గా చేరి 2020 వరకు పనిచేశాను. ఆ తర్వాత కొవిడ్​ వచ్చింది. ఆ సమయంలో అందరం ఖాళీగా ఉన్నాం. అప్పుడే నేను నా జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు ప్రణాళికను తయారు చేసుకొని అమలు చేశాను. మనం అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతుంటాం. అంతేకాకుండా నేను మా కాలేజీలో పాఠాలు చెప్పేటప్పుడు కూడా విద్యార్థులు చదువులో ఎందుకు వెనకబడతారని ఆలోచించాను. ఇందుకు కారణం ఏంటని చూస్తే మెమొరీ పవర్​ లోపించడం అని గమనించాను. అందుకని దీనిని అధిగమించేందుకు పని చేద్దాం అని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే 2021 నుంచి నా పనిని మొదలుపెట్టాను. ఈ సమయంలో చాలా రకాల జాతీయ, అంతర్జాతీయ పుస్తకాలు చదివాను. సోషల్​ మీడియా సాయం తీసుకున్నాను"

- అభయ్​ కుమార్​, మైండ్​ అండ్​ మెమోరీ కోచ్​

సామాజిక సేవగా!
నేటి తరం పిల్లల్లో జ్ఞాపకశక్తి రోజురోజుకూ మరింత లోపిస్తోందని, దానిని నివారించేందుకు కృషి చేస్తున్నానని తెలిపాడు అభయ్​. ఇందులో భాగంగానే తన వంతు సాయంగా జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు ఉచితంగా మెమొరీ పవర్​ను పెంపొందించుకోవడానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పాడు. అంతేకాకుండా ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్​సైట్​ను కూడా రూపొందించాడు. దీని ద్వారా పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే తాము అందించే సూచనల ఆధారంగా జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని అంటున్నాడు ఈ మైండ్​ అండ్​ మెమోరీ కోచ్​.

అతిపొడవైన జడతో స్మిత గిన్నిస్​ రికార్డ్- రాలిన జుట్టుతో వారికి సాయం!

ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్- 500ఏళ్ల వరకు నో డ్యామేజ్- ధర కూడా తక్కువే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.