ETV Bharat / bharat

చనిపోయిన వైద్యుడికి పదోన్నతి!

మృతిచెందిన ఓ డాక్టర్​కు పదోన్నతి లభించింది. ఈ విషయంపై ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

bihar
చనిపోయిన డాక్టర్​కు పదోన్నతి!
author img

By

Published : Mar 10, 2021, 5:35 AM IST

నెల క్రితం మృతిచెందిన ఓ వైద్యుడికి పదోన్నతి ఇస్తూ బిహార్ వైద్యఆరోగ్య శాఖ​ ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను వేరే చోటుకి బదిలీ చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఘటన సోమవారం జరిగింది.

రోహతస్​ జిల్లా బిక్రమ్​గంజ్ సబ్​ డివిజనల్​ ఆస్పత్రి ఇం​ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్​ రామ్​నారాయణ్ రామ్ ఫిబ్రవరి 7న మృతిచెందారు. అయితే ఆయన చనిపోయిన నెల రోజులకి ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ పదోన్నతి ప్రకటిస్తూ నోటీసులు పంపింది. షేక్​పుర జిల్లా ఆస్పత్రి సివిల్​ సర్జన్​గా నియమిస్తున్నట్లు అందులో పేర్కొంది. దీనిపై వైద్యఆరోగ్య శాఖ జాయింట్​ సెక్రటరీ సంతకం కూడా ఉంది.

ఈ విషయాన్ని రోహతస్​ జిల్లా సివిల్​ సర్జన్​ డాక్టర్ సుధీర్​ కుమార్​ గమనించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్​ రామ్​ ఫిబ్రవరి 7న మృతి చెందారని ధ్రువీకరించారు. ఆయన స్థానంలో ఇంకో వైద్యుడిని నియమించినట్లు స్పష్టం చేశారు.

విమర్శలు..

ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. వైద్య శాఖ నిర్లక్ష్యం బయటపడింది అంటూ ఆర్​జేడీ నేత విజయ్​ సామ్రాట్​ ధ్వజమెత్తారు. 'ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం మరోటి లేదు. అవినీతిలో కూరుకుపోవడం వల్ల ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది' అని మరో ఆర్​జేడీ ఎమ్మెల్యే భాయ్ బీరేంద్ర వ్యాఖ్యానించారు.

'రాష్ట్రంలోని ప్రతి విషయాన్ని తమ ప్రభుత్వం సమీక్షిస్తుందని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్తుంటారు. మరి ఇప్పుడు ఓ మృతిచెందిన వ్యక్తిని బదిలీ చేస్తున్నట్టు ఆదేశాలు ఎలా జారీ చేశారో నితీశ్​ వివరణ ఇవ్వాలి'​ అని కాంగ్రెస్ నేత అజిత్ శర్మ డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి : బిహార్​లో ప్రహరీ గోడ కూలి ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.