కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్న ప్రముఖుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్ సింగ్ మృతి చెందారు.
ఏప్రిల్ 15న కరోనా బారిన పడిన ఆయన.. పట్నాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.
అరుణ్ కుమార్ 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. చీఫ్ సెక్రటరీగా దీపక్ కుమార్ పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బాధ్యతలు స్వీకరించారు అరుణ్ కుమార్.
ఇదీ చూడండి: మాజీ అటార్నీ జనరల్ మృతి- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం