ETV Bharat / bharat

బిహార్​లో మరో వారం లాక్​డౌన్​ పొడిగింపు

కరోనా వ్యాప్తి దృష్ట్యా బిహార్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాల్లో ఆంక్షలను పొడిగించారు. బిహార్​ జూన్​ 8 వరకు లాక్​డౌన్​ కొనసాగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించగా, జూన్​ 9 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఉత్తరాఖండ్​ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఉత్తర్​ప్రదేశ్​లో 61 జిల్లాల్లో ఆంక్షలను సడలించారు.

bihar lockdown, uttarakhand curfew
ఆ రాష్ట్రాల్లో లాక్​డౌన్​ పొడిగింపు
author img

By

Published : May 31, 2021, 3:31 PM IST

కరోనా వ్యాప్తి దృష్ట్యా బిహార్​లో ప్రస్తుతం విధించిన లాక్​డౌన్​ను జూన్​ 8 వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ వెల్లడించారు. అయితే వ్యాపారులు.. కార్యకలాపాలు నిర్వహించేందుకు కొన్ని సడలింపులు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్​లో పొడిగింపు..

ఉత్తరాఖండ్​లో ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి సుబోధ్​ ఉనియల్​ ప్రకటించారు. జూన్​ 9 ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుందని తెలిపారు. జూన్​ 1 నుంచి జూన్​ 7 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసర సరకులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

ఉత్తర్​ప్రదేశ్​లో సడలింపు

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని 61 జిల్లాల్లో ఆంక్షలను సడలించింది. ఆదివారం 55 జిల్లాల్లో సడలింపులు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం సోమవారం మరో ఆరు జిల్లాల్లోనూ మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది. మిగతా 14 జిల్లాల్లో కొవిడ్ ఉద్ధృతి తగ్గనందున ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.

జూన్​ 1 నుంచి ఈ సడలింపులు అమలులోకి వస్తాయని యూపీ ప్రభుత్వం తెలిపింది. అయితే రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు ఉండే కర్ఫ్యూ యాథావిధిగా కొనసాగుతుందని.. వారాంతంలో రెండు రోజులు కర్ఫ్యూ పూర్తిస్థాయిలో అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి : దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.