రోడ్లపై మద్యం తాగి ఎటు పోలేని స్థితిలో ఉన్న బడాబాబుల సౌకర్యార్థం.. బిహార్ అబ్కారీ శాఖ ప్రత్యేక వసతులు కల్పిస్తోంది. వారి కోసం ఏకంగా ప్రత్యేక సౌకర్యాలతో కూడిన వార్డులను సిద్ధం చేసింది. రోడ్లపై తాగి తిరిగే వారిని అతిథుల మాదిరిగా సపర్యలు చేయడానికి సమస్తిపుర్ అబ్కారీశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
![Bihar excise department](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16599502_aa.jpg)
![Bihar excise department](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16599502_ww.jpg)
ప్రభుత్వ ఉద్యోగులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు రోడ్లపై తాగి ఎక్కడపడితే అక్కడ తిరగకుండా.. వార్డులోనే మద్యం మత్తు దిగేదాకా ఉండొచ్చని సర్కారు సూచించింది. వారి కోసం 24 గంటల పాటు బెడ్లు, దుప్పట్లతో పాటు ఏసీలను ఏర్పాట్లు చేయడమే కాకుండా వారిని కాపలా కాయడానికి ఓ శునకాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు.
![Bihar excise department](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16599502_bb.jpg)
![Bihar excise department](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16599502_ss.jpg)
ఇవీ చదవండి: జాలర్ల కిడ్నాప్‌కు పాక్ యత్నం.. ఆపై కాపాడామంటూ కట్టుకథ.. కేసు నమోదు
మేకకు దైవభక్తి.. దేవుడి సన్నిధిలో తలవంచి ప్రార్థనలు!.. వీడియో వైరల్