ETV Bharat / bharat

ఏడాదిలో ఐదుసార్లు కొవిడ్​ టీకా తీసుకున్న డాక్టర్​! - ఐదు డోసులు తీసుకున్న బిహార్​ డాక్టర్

Bihar Doctor Vaccine News: బిహార్​లోని ఓ సివిల్​ సర్జన్​ 5 సార్లు వ్యాక్సిన్​ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.

covid vaccine
కొవిడ్​ టీకా
author img

By

Published : Jan 18, 2022, 1:47 PM IST

Bihar Doctor Vaccine News: ఇటీవల బిహార్​కు చెందిన ఓ వృద్ధుడు 11 సార్లు టీకా తీసుకుని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు అటువంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అదే రాష్ట్రానికి చెందిన ఓ డాక్టర్​ ఐదు సార్లు వ్యాక్సిన్​ తీసుకున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై వారు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ జరిగింది..

కొవిన్​ పోర్టల్​ వివరాల ప్రకారం.. బిహార్​లోని పట్నాకు చెందిన సివిల్​ సర్జన్​ డాక్టర్​ విభా కుమారీ సింగ్ గతేడాది జనవరి 28న తొలిడోసు తీసుకున్నారు. మార్చి నాటికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ తీసుకున్నారు. ఈనెల 13న ప్రికాషన్​ డోసు తీసుకున్నారు. కానీ ఆమె గతేడాది ఫిబ్రవరి 6న, జూన్​ 17న కూడా వ్యాక్సిన్​ తీసుకున్నట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది.

నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పట్నా జిల్లా మెజిస్ట్రేట్​ చంద్రశేఖర్ సింగ్​ సోమవారం స్పష్టం చేశారు.

ఈ విషయంపై డాక్టర్​ విభా స్పందించారు. తాను ఆ వ్యాక్సిన్లు తీసుకోలేదని.. ఎవరో తన పాన్​ కార్డు వివరాలను ఉపయోగించి ఇలా చేసి ఉంటారని పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి : 12-14 ఏళ్ల వయసు చిన్నారులకు టీకా ఇప్పుడే కాదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.