కరోనా నియంత్రణకు 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలకు సైతం కొవాగ్జిన్ (Covaxin) టీకా ఇచ్చేలా భారత్ బయోటెక్ సంస్థ తీవ్రంగా కృషిచేస్తోంది. పిల్లలపై.. కొవాగ్జిన్ టీకా 2,3 దశల క్లినికల్ ట్రయల్స్ బిహార్‌లోని పట్నా ఎయిమ్స్‌లో ప్రారంభమయ్యాయి. ఈ టీకాను 525 మందిపై పరీక్షిస్తున్నారు.
2-18 ఏళ్ల వయస్కులపై.. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు గత నెల 11న డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది.
ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ విడతల వారిగా సాగుతోంది. మొదటి దశలో భాగంగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఫిబ్రవరి 2న టీకా పంపిణీ ప్రారంభం అయింది. రెండో దశలో మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా ఇస్తున్నారు. గత నెల 1న 18 ఏళ్లు దాటిన వారికి కూడా టీకా పంపిణీ మొదలైంది.
ఇదీ చదవండి : పిల్లలపై 'జైకొవ్-డి' టీకా ట్రయల్స్