ETV Bharat / bharat

'ఇదేమైనా ఇంగ్లాండా?'.. ఆంగ్లం​లో మాట్లాడిన యువరైతుకు సీఎం చీవాట్లు! - నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి

ఆంగ్లంలో మాట్లాడిన యువరైతును మందలించారు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్. స్థానిక భాషలో మాట్లాడాలని సీఎం అతడికి సూచించారు. స్మార్ట్​ఫోన్ల వాడకంతో సొంత భాషలను మర్చిపోతున్నారని సీఎం వ్యాఖ్యానించారు.

Nitish kumar english
Nitish kumar english
author img

By

Published : Feb 21, 2023, 7:57 PM IST

ఇంగ్లిష్​లో మాట్లాడిన ఓ రైతును బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మందలించారు. తన జీవిత ప్రయాణాన్ని వివరిస్తున్న ఆ రైతు.. ఎక్కువగా ఆంగ్ల పదాలు వాడటాన్ని చూసిన సీఎం.. అతడికి హితబోధ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగో వ్యవసాయ రోడ్​మ్యాప్ కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన జరిగింది. పట్నాలోని బాపూ సభాఘర్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీఎం ముందు మాట్లాడిన వ్యక్తి.. తనను తాను అమిత్ కుమార్​గా పరిచయం చేసుకున్నాడు. తనది లఖిసరాయ్​ అని తెలిపాడు.

ముఖ్యమంత్రి నీతీశ్​ను పొగుడుతూనే ప్రసంగం ప్రాంభించాడు అమిత్ కుమార్. తాను మేనేజ్​మెంట్​ పూర్తి చేశానని, పుణెలో మంచి జీతంతో పని చేసే వాడినని తెలిపాడు. అలాంటి తాను ప్రస్తుతం సొంత జిల్లాలో పుట్టగొడుగుల సాగు చేస్తున్నట్లు వివరించాడు. తనకు, తనలాంటి వారికి వ్యవసాయంలోకి వచ్చి రాణించేందుకు అనువైన పరిస్థితిని కల్పించిన సీఎంకు కృతజ్ఞత చెప్పాడు. మంచి ఉద్యోగం వదిలి వ్యవసాయంలోకి రావొచ్చనే ధైర్యాన్ని కల్పించారని సీఎంను కొనియాడాడు. అయితే, తన ప్రసంగంలో ఎక్కువ ఇంగ్లిష్ పదాలు వాడాడు అమిత్. ఈ విషయంలోనే నీతీశ్ కాస్త అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో యువకుడు మాట్లాడుతుండగా అడ్డుకున్నారు సీఎం.

తన కుర్చీలోనే ఉండి.. యువ వ్యవసాయదారుడి ప్రసంగాన్ని ఆపారు సీఎం నీతీశ్. చేతిలో ఉన్న మైక్రోఫోన్​తో.. కాస్త ఆగాలని అతడికి సైగ చేశారు. 'నువ్వు చాలా ఎక్కువగా ఇంగ్లిష్ పదాలు ఉపయోగిస్తున్నావు. ఇది అసంబద్ధంగా ఉంది. దీన్ని ప్రస్తావించాలనే నేను నీ ప్రసంగాన్ని ఆపాను. అసలు ఇదేమైనా ఇంగ్లాండా? నువ్వు బిహార్​లో పనిచేస్తున్నావు. వ్యవసాయం చేస్తున్నావు. వ్యవసాయం అనేది సామాన్యులు చేసే పని' అంటూ యువకుడికి సందేశం ఇచ్చారు నీతీశ్. సీఎం చేసిన వ్యాఖ్యలతో సభ అంతా కరతాళ ధ్వనులతో మోగిపోయింది. స్థానిక భాషలో మాట్లాడాలని సీఎం చెప్పడంపై సభికులు హర్షం వ్యక్తం చేశారు.

కరోనా సమయంలో స్మార్ట్​ఫోన్ల వాడకం పెరిగిందని.. దీంతో సొంత భాషలను మర్చిపోతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ప్రసంగాన్ని తిరిగి ప్రారంభించిన యువరైతు.. ప్రభుత్వ పథకాలు అనే పదాన్ని ఆంగ్లంలో చెప్పాడు. దీంతో మధ్యలో కల్పించుకున్న సీఎం.. 'సర్కారీ యోజన (హిందీలో) అని చెప్పలేవా? నేను ఇంజినీరింగ్ చదివా. ఇంగ్లిష్ మీడియంలోనే విద్యనభ్యసించా. కానీ అది అకాడమిక్ విషయాలకు సంబంధించిన విషయం. రోజూవారి వ్యవహారాల్లో ఆంగ్లాన్నే ఎందుకు వాడాలి?' అని యువకుడిని ప్రశ్నించారు.

చివరకు క్షమాపణ చెప్పి ప్రసంగం కొనసాగించాడు యువరైతు. అయితే, ఈ ఘటనపై భాజపా వ్యంగస్త్రాలు సంధించింది. నీతీశ్ కుమార్​కు ఆంగ్లంతో సమస్యా? లేదంటే దాన్ని వాడిన విధానంతోనా అని ప్రశ్నించింది. బహిరంగ సభల్లో ఇలా సీఎం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్ ఆనంద్ విమర్శించారు. ప్రధానమంత్రి కావాలని ఆయన పగటి కలలు కంటున్నారని, అందుకే ఆయనకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని చురకలు అంటించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.