ETV Bharat / bharat

మట్టి కింద ఆరడుగుల లోతులో బాలుడు- చివరకు... - బిహార్​ న్యూస్​

దాదాపు అరగంటపాటు, ఆరడుగుల లోతు మట్టిలో కూరుకుపోతే ఎవరైనా బతికి బయటపడగలరా? అంటే.. కష్టమనే చెప్పాలి. కానీ బిహార్​లో మట్టిదిబ్బల్లో కూరుకుపోయిన ఓ పిల్లాడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు.

Child buried alive in pit rescued in Bihar
ఆరడుగుల లోతులో కూరుకుపోయి బతికిన చిన్నారి
author img

By

Published : Jul 4, 2021, 5:27 PM IST

ఆరడుగుల లోతులో కూరుకుపోయి.. బతికిన చిన్నారి

బిహార్​, కటిహార్ జిల్లాలో అద్భుతం జరిగింది. దాదాపు 30 నిమిషాల పాటు ఆరు అడుగుల లోతు మట్టిలో కూరుకుపోయిన బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. గ్రామస్థులంతా కలిసి పిల్లాడిపై పేరుకుపోయిన మట్టి దిబ్బలను తీసి రక్షించారు.

ఇదీ జరిగింది..

జిల్లాలోని ఫర్సదాంగి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మట్టి కోసం పెద్ద మొత్తంలో గుంతలను తవ్వారు. చుట్టుపక్కల పిల్లలు ఆ గుంతల్లో ఆడుకుంటున్నారు. ఆ క్రమంలో హఠాత్తుగా మట్టిదిబ్బలు కూలి.. ఓ పిల్లాడిపై పడిపోయాయి. దాదాపు ఆరు అడుగుల లోతులో పిల్లాడు కూరుకుపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఘటనా స్థలానికి వచ్చి.. వేగంగా మట్టి దిబ్బలను తొలగించారు. పిల్లాడిని రక్షించారు. అంత సమయం గడిచినా పిల్లాడు సురక్షితంగా బయటపడ్డాడు. అతడ్ని స్థానిక రైతు గుజర్​ రాయ్​ కుమారుడు విజయ్​గా గుర్తించారు. బాలుడు సురక్షితంగా బయటపడటం పట్ల గ్రామస్థులంతా అనందం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇవీ చదవండి:మాజీ భార్యే సవతి తల్లి అయిందని తెలిస్తే...

తల్లి, తమ్ముడిని కాపాడిన రెండేళ్ల పాప

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.