బిహార్ పశ్చిమ చంపారన్‌లో దారుణం జరిగింది. చెల్లెలు స్నానం చేస్తుండగా వీడియో తీశారు ఇద్దరు సోదరులు. అనంతరం ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వైరల్ చేస్తామని బెదిరించి.. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన శిఖర్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దియులియా గ్రామంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాధితురాలి కుటుంబ సభ్యులు మొహర్రం ఊరేగింపునకు వెళ్లారు. బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో నిందితులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులు మహ్మద్ ఫైజ్, మహ్మద్ రాజన్ గోడ ఎక్కి బాలిక ఇంట్లోకి ప్రవేశించారు. బాలిక స్నానం చేస్తుండగా వీడియో తీశారు. ఫేస్బుక్లో వీడియోను అప్లోడ్ చేస్తామని బెదిరించి సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ప్రధాన నిందితుడు. కొన్ని రోజుల తర్వాత నిందితుడి సోదరుడు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పరారీలో ఉన్న రెండో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఎనిమిదేళ్ల బాలికను..
ఝార్ఖండ్‌లో ఎనిమిదేళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు 35 ఏళ్ల వ్యక్తి. గిరీడీహ్ జిల్లాలోని బిర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ దారుణం జరిగింది. మిక్కు మండల్‌ను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి.. ముమ్మరంగా గాలిస్తున్నారు. బాధితురాల్ని మెరుగైన చికిత్స కోసం ధన్‌బాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని తెలిపారు.
బాధితురాలు తన తల్లితో కలిసి గ్రామ సమీపంలోని నది వద్ద స్నానానికి వెళ్లింది. గ్రామ పెద్ద కాంచన దేవి అదే నదికి స్నానానికి వచ్చింది. అయితే కాంచన దేవి.. నది దగ్గర సబ్బు మరిచిపోయి ఇంటికి వెళ్లిపోయింది. వెంటనే బాధితురాలి తల్లి సబ్బును గ్రామ పెద్ద ఇంటికి వెళ్లి ఇచ్చేయమని బాలికను పంపింది. అప్పుడు బాధితురాలు గ్రామ పెద్ద ఇంటికి వెళ్లింది. అప్పుడు ఆమె ఇంట్లో లేదు. ఆమె భర్త మిక్కు మండల్ ఉన్నాడు. బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు మండల్. ఆ తర్వాత బాలిక నదికి వెళ్లకుండా తన ఇంటికి వెళ్లింది. రక్తాన్ని చూసి ఏమైందని బాధితురాలి తల్లి అడగ్గా.. జరిగిన విషయమంతా చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు నిందితుడిపై బిర్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: 'మీకో నమస్కారం.. ప్రధాని రేసులో నేను లేను.. ఇక దయచేసి వదిలేయండి'
దిల్లీలో కలకలం.. 2వేల తూటాలు స్వాధీనం.. ఉగ్ర కోణంలో దర్యాప్తు!