ETV Bharat / bharat

వంతెన 'గంగ'పాలు.. సీఎం సీరియస్.. 'బాధ్యులపై కఠిన చర్యలు తప్పవ్' - బీహార్ నితీశ్ కుమార్ వంతెన కూలిన వార్తలు

Bihar bridge collapse : బిహార్‌లో రెండు జిల్లాలను అనుసంధానించేందుకు రూ. 1,700 కోట్లతో నిర్మిస్తున్న వంతెన గంగానది పాలైంది. గతేడాది ఏప్రిల్‌ 30న గాలిదుమారానికి వంతెనలో కొంతభాగం కూలగా.. మిగిలిన భాగం ఏడాది తర్వాత ఇప్పుడు నేలమట్టమైంది. ప్రభుత్వ అవినీతే ఇందుకు కారణమని బీజేపీ ఆరోపించగా.. కమలం పార్టీ నేతలు మంత్రులుగా ఉండగానే వారథి నిర్మాణం జరిగిందని అధికార కూటమి ఎదురుదాడికి దిగింది.

bihar bridge collapse
bihar bridge collapse
author img

By

Published : Jun 5, 2023, 2:52 PM IST

Bihar bridge collapse : బిహార్​లో వంతెన కూలిన ఘటనలో కారకులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ స్పష్టం చేశారు. వంతెన నిర్మాణంలో అనేక లోపాలు ఉన్నాయని పేర్కొన్న ఆయన.. అందుకే 14 నెలల కాలంలో రెండు సార్లు బ్రిడ్జి కూలిందని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని సంబంధిత శాఖను ఆదేశించినట్లు నీతీశ్ వెల్లడించారు. 2014లో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని.. ఇప్పటివరకు పనులు కొనసాగడానికి కారణాలేంటో తెలుసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం.

ఎప్పుడో ప్రారంభించాల్సి ఉన్నా..
బిహార్‌లో ఖగారియా జిల్లాను భాగల్‌పుర్‌ జిల్లాతో అనుసంధానించేందుకు గంగానదిపై భాగల్‌పుర్‌ వద్ద 1,700కోట్ల రూపాయల వ్యయ ప్రతిపాదనతో వంతెన నిర్మాణం చేపట్టారు. 2019 కల్లా ఈ వారధిని నిర్మించి.. ఉత్తర బిహార్‌ ప్రజలకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. కానీ వంతెన నిర్మాణంలో ఉండగానే గతేడాది ఏప్రిల్‌ 30న గాలిదుమారం ధాటికి వంతెనలో కొంతభాగం కూలింది. ఈ నేపథ్యంలో వంతెన భద్రతపై IIT-రూర్కీ నిపుణులతో అధ్యయనానికి బిహార్ సర్కార్‌ ఆదేశాలు జారీచేసింది. అప్పుడు బిహార్‌లో JDU-బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. సరిగ్గా ఏడాది తర్వాత జూన్‌ 4న వంతెన మిగతా భాగం అందరూ చూస్తుండగానే పేకమేడలా కూలిపోయింది.

వంతెన గంగపాలు కావడం వల్ల ప్రతిపక్ష బీజేపీ.. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసింది. ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. బిహార్‌ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్‌ చౌదరి, ఎమ్మెల్యే షానవాజ్ హుస్సేన్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే విపక్షాల ఆరోపణలను బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ కొట్టిపారేశారు. IIT- రూర్కీ నిపుణులు ఇంకా నివేదిక ఇవ్వకున్నా.. వంతెనలో అనేక నిర్మాణపరమైన లోపాలు ఉన్నట్లు చెప్పారని వివరించారు. అందుకే వంతెనలో కొంత భాగాన్ని ఉద్దేశపూర్వకంగానే కూల్చినట్లు చెప్పారు. ఇప్పుడు మిగిలిన భాగం కూలిపోవడం.. తమ అంచనాలను బలం చేకూర్చిందని తేజస్వీ యాదవ్ చెప్పారు. గతంలో బీజేపీ నాయకులు మంగల్ పాండే, నంద కిషోర్, నితిన్ నబిన్‌ రోడ్లు భవనాలశాఖ మంత్రులుగా ఉండగానే.. వంతెన ఎక్కువ భాగం నిర్మించారని తేజస్వీ చెప్పారు. ఇప్పుడు వంతెన కూలినందుకు బాధ్యత బీజేపీ తీసుకుంటుందా అని ఆయన ట్విట్టర్‌లో ప్రశ్నించారు. మొత్తం తప్పులను సరిచేసిన తర్వాత వంతెనను పూర్తిస్థాయిలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తేజస్వీ వివరించారు.

ఇదే సమయంలో భాగల్‌పుర్‌ వంతెన కూలిన ఘటనలో ఒక సెక్యూరిటీ గార్డు గల్లంతైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు.. నదిలో గాలింపు చేపట్టారు. ఎస్పీ సింగ్లా కంపెనీలో పనిచేస్తున్నగార్డు గల్లంతైనట్లు తమకు సమాచారం అందిందని పరబట్టా సర్కిల్ అధికారి చందన్‌ కుమార్‌ చెప్పారు. ఎన్​డీఆర్ఎఫ్, ఎస్​డీఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతో అతడి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.