ETV Bharat / bharat

సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కట్నం.. సినిమా రేంజ్​లో పెళ్లిపందిరికి.. - రాజస్థాన్​ నాగౌర్ మైరా సాంప్రదాయం

తన సోదరి పెళ్లికి భారీ కట్నం సమర్పించి చరిత్ర సృష్టించారు రాజస్థాన్​కు చెందిన ఇద్దరు సోదరులు. ఒకటి, రెండు కోట్లు కాదండీ బాబు.. ఏకంగా 8 కోట్లకు పైగానే కట్నకానుకలు అందించారు సోదరులు. ఇంత భారీ మొత్తంలో కట్నం సమర్పించడం వల్ల ఇది స్థానికంగా వైరల్​గా మారింది.

biggest myra in rajasthan
biggest myra in rajasthan
author img

By

Published : Mar 26, 2023, 11:00 PM IST

సోదరి పెళ్లి కోసం రూ.8.1 కోట్లను కట్నంగా అందించిన సోదరు

తన సోదరి పెళ్లికి రూ. 2.21 కోట్ల నగదు సహా రూ. 8.1 కోట్లు విలువచేసే ఆస్తులను, బంగారు, వెండి ఆభరణాలను కట్నంగా ఇచ్చారు ఇద్దరు సోదరులు. అయితే ఆ కట్నాన్ని అందించడానికి వందలాది మంది వారితో పాటుగా వెళ్లారు. దీంతో దాదాపు రెండు కిలోమీటర్లు మేర వాహనాలు బారులు తీరాయి. సోదరికి కట్నం అందించడానికి వందలాది కార్లు, ట్రాక్టర్లు, ఒంటెల బండ్లు, ఎద్దుల బండ్లతో సోదరి వద్దకు చేరుకున్నారు ఆ సోదరులు. రాజస్థాన్​కు చెందిన ఇద్దరు సోదరులు తన సోదరి వివాహానికి ఈ భారీ కట్నానికి కానుకగా సమర్పించారు. ఇలా పెళ్లి వేడుకకు కట్నకానుకలు సమర్పించడాన్ని స్థానికంగా 'మైరా' అంటారు.

నాగౌర్​ జిల్లాలోని ధింగ్‌సార గ్రామానికి చెందిన అర్జున్ రామ్​ మెహారియా, భగీరథ్ మెహారియాలు కలిసి తన సోదరికి వివాహాం జరిపించారు. దీనిలో భాగంగా వీరు తమ సోదరికి కానుకగా.. దాదాపుగా రూ. 8.1 విలువ చేసే ఆస్తులను కానుకగా అందించారు. దీనిలో రూ. 2.21 కోట్ల నగదుతో పాటుగా 1.105 కేజీల బంగారం, 14 కేజీల వెండి ఉన్నాయి. దీంతోపాటుగా రూ. 4.42 కోట్లు విలువచేసే భూమిని కానుకగా అందించారు. అవే కాకుండా ఆ సోదరులు తన సోదరి కోసం ఓ ట్రాక్టర్​ గోదుమలు, స్కూటీతో పాటుగా మరి కొన్ని వాహనాలు, నగలను కట్నంగా సమర్పించారు. నాగౌర్​ జిల్లాలో అర్జున్​, భగీరథ్​ మెహారియాలు తమ సోదరికి అందించిన కట్నమే అతిపెద్దదిగా స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ వీడియో స్థానికంగా వైరల్​గా మారింది. అయితే ఈ ఆచారం ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతుందని.. అలా సోదరి పెళ్లికి భారీగా కట్నం అందించడం తమ కుటుంబ సాంప్రదాయం అని ఆ సోదరులు తెలిపారు.

మైరా సంప్రదాయం..
మైరా ఎన్నో ఏళ్లుగా నాగౌర్​లో కొనసాగుతున్న సంప్రదాయం. దీన్నే 'మైరా'గా పిలుస్తారు. హిందూ సంప్రదాయ పెళ్లిలో ఇది ఒక భాగం. చెల్లెలికి ఆర్థిక భారం తగ్గించేందుకు ఆమె సోదరులు ఈ మైరాను అందజేస్తారు. ఇందులో భాగంగా సోదరి పెళ్లి వేడుకను సోదరులే దగ్గరుండి జరిపిస్తారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ ఈ గ్రామంలో తన సోదరికి వివాహానికి అందించనంత కట్నకానుకలు సమర్పించి పెళ్లి జరిపించారు ఈ ఇద్దరు అన్నదమ్ములు. ఏకంగా రూ. 8.1 కోట్ల విలువ చేసే నగదు, బహుమతులను పెళ్లికి కట్నంగా ఇచ్చారు.

మేనకోడలి పెళ్లికి రూ.3.21 కోట్ల కట్నం
ఇటీవలే ఇదే జిల్లాలో మేనకోడలి పెళ్లికి రూ.3.21 కోట్ల విలువ చేసే నగదు, ఆస్తులను కట్నంగా ఇచ్చారు ముగ్గురు సోదరులు. అందులో 10 ఎకరాల వ్యవసాయ భూమి, రింగ్ రోడ్డు పక్కన 30 లక్షలు విలువ చేసే ప్లాట్ ఉంది. అలాగే 41 తులాల బంగారం, మూడు కేజీల వెండిని మేనకోడలికి కట్నంగా ఇచ్చారు. ట్రాక్టర్, స్కూటీని సైతం మేనకోడలికి కానుకగా ఇచ్చారు ఈ ముగ్గురు సోదరులు. అదే విధంగా ఊర్లోని ప్రతి ఇంటికి ఓ వెండి నాణేన్నిపెళ్లి గిఫ్ట్​గా ఇచ్చారు. వీరిది నాగౌర్​ జిల్లాలోని బుర్డీ అనే గ్రామం. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.