ETV Bharat / bharat

వంశదేవతలుగా గుండ్రటి రాళ్లకు పూజలు!- చివరకు డైనోసార్​ గుడ్లుగా గుర్తింపు- ఎక్కడో తెలుసా? - డైనోసార్​ గుడ్లగా మారిన గుండ్రటి రాళ్లు

Big Round Stones Found As Dinosaur Eggs : వంశదేవతలుగా భావించి గుండ్రటి రాళ్లకు ఏళ్ల నుంచి పూజలు చేస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు. చివరకు అవి డైనోసార్​ గుడ్లని తెలియడం వల్ల ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్​లోని ధార్​ జిల్లాలో వెలుగుచూసింది.

Big Round Stones Found As Dinosaur Eggs In Madhya Pradesh Dhaar District
Big Round Stones Found As Dinosaur Eggs
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 12:52 PM IST

Big Round Stones Found As Dinosaur Eggs : తరతరాలుగా పూజలు అందుకుంటున్న గుండ్రటి ఆకారంలోని రాళ్లను అంతరించిపోయిన డైనోసార్​ గుడ్లుగా తేల్చారు లఖ్​నవూలోని బీర్బల్ సాహ్ని ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ పాలియోసైన్సెస్​కు చెందిన శాస్త్రవేత్తలు. దీంతో కొన్నేళ్లుగా వాటినే వంశదేవతలుగా కొలుచుకుంటున్న ఆ గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి​ గురయ్యారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్​ ధార్​ జిల్లా నర్మదా వ్యాలీ ప్రాంతంలోని పడ్లియా గ్రామంలో జరిగింది. కాగా, ఈ ప్రాంతంలో లక్షల ఏళ్ల క్రితం డైనోసార్​లు మనుగడ సాగించేవని, సుమారు 65 మిలియన్ల సంవత్సరాల క్రితం ఇక్కడ డైనోసార్లు తిరిగాయని స్థానికులు చెబుతున్నారు.

గత కొన్నేళ్లుగా
నర్మదా వ్యాలీ ప్రాంతంలో డైనోసార్​ గుడ్లను కనుగొనడం ఇదేమీ తొలిసారి కాదు. కొన్ని సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు వందల సంఖ్యలో డైనోసార్​ గుడ్లను ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గ్రామస్థులు తమ పొలాల్లో ఈ గుండ్రటి రాళ్ల(డైనోసార్​ గుడ్లు)ను పెట్టి పూజిస్తారు. ఈ ఆచారం గత కొన్ని శతాబ్దాలుగా పాటిస్తున్నామని, వాటిని తమ వంశదేవతగా భావించి ప్రార్థిస్తామని చెబుతున్నారు. ఇక తాజాగా అవి(రాళ్లు) డైనోసార్​ గుడ్లని తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు.

Big Round Stones Found As Dinosaur Eggs In Madhya Pradesh Dhaar District
గుండ్రటి రాళ్లనుకొని డైనోసార్​ గుడ్లకు పూజలు

"గుండ్రంగా ఉన్న ఈ రాళ్లను 'కాకర్'​ అంటే 'పొలాల భైరవుడి'గా పూజిస్తాము. ఊర్లోని అందరూ తమ తమ ఇళ్ల దగ్గర, పొలాల్లో ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. మా పూర్వీకుల కాలం నుంచి దీనిని అనుసరిస్తున్నాము. ఇలా చేస్తే మా వ్యవసాయం, పాడిపశువులు బాగా వృద్ధి చెందుతాయి. వారి(వంశదేవతలు-గుండ్రటి రాళ్లు) అనుగ్రహం మాపై ఉంటుంది. అంతే కాకుండా విపత్కర పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడతారని మా నమ్మకం."
- వేస్తా మాండ్లోయ్​, గ్రామస్థుడు

ఎక్కడ చూసినా అవే
గతంలో కూడా ఈ ప్రాంతంలో 256 డైనోసార్​ గుడ్లను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. వీటి పరిమాణం 15-17 సెంటిమీటర్లుగా గుర్తించారు. దీంతో ఈ ప్రాంతంలో కొన్నేళ్ల నుంచి పరిశోధనలు జరుపుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే ఇలాంటి గుండ్రటి రాళ్లు ఆ గ్రామంలో విరివిగా కనిపిస్తూనే ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అంతరించిపోయిన డైనోసార్ల గుడ్ల భద్రతకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి భద్రతా ఏర్పాట్లు గానీ, ఈ ప్రాంతాన్ని పరిరక్షించడానికి నిర్దిష్టమైన చర్యలు గానీ అధికారులు ఇప్పటివరకు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు.

వంశదేవతలుగా గుండ్రటి రాళ్లకు పూజలు- చివరకు డైనోసార్​ గుడ్లుగా గుర్తింపు- ఎక్కడో తెలుసా?

ఇక డైనోసార్​ గుడ్లు లభించిన ప్రాంతానికి లఖ్​నవూలోని బీర్బల్ సాహ్ని ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ పాలియోసైన్సెస్​ శాస్త్రవేత్తలు, మధ్యప్రదేశ్ అటవీ శాఖ అధికారులు చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి శిలాజాలు అంటే టైటానో-స్టోర్క్ జాతికి చెందిన డైనోసార్‌ల గుడ్లని వారు ప్రాథమికంగా గుర్తించారు. మరోవైపు జిల్లాలో డైనోసార్​ గుడ్లు దొరికాయని ధార్ జిల్లా కలెక్టర్ ప్రియాంక్ మిశ్రా ధ్రువీకరించారు.

మార్చి నుంచి GPS విధానంలో టోల్ ఛార్జ్​లు- ట్రాఫిక్​ను తగ్గించేందుకే!

తమిళనాడులో వరదల బీభత్సం- జనజీవనం అస్తవ్యస్తం,హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.