ETV Bharat / bharat

సీఎం మార్పుపై కుదిరిన రాజీ!

ఛత్తీస్​గఢ్​ సీఎం(chhattisgarh cm) పదవి నుంచి వైదొలగేందుకు భూపేశ్​ బఘేల్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. టీఎస్​ సింగ్​ దేవ్​కు నూతన బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి.

bhupesh bhagel
భూపేశ్ బఘేల్
author img

By

Published : Aug 25, 2021, 5:20 AM IST

గతంలో కుదుర్చుకున్న అవగాహన ప్రకారం ముఖ్యమంత్రి పదవిని టీఎస్ సింగ్‌ దేవ్‌కు అప్పగించేందుకు ఛత్తీస్‌గఢ్ సీఎం(chhattisgarh cm) భూపేశ్‌ బఘేల్‌ అయిష్టంగానే అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశం వెలువడిన వెంటనే రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు నేతలతో మంగళవారం దీల్లీలోని తన నివాసంలో 3 గంటలకు పైగా చర్చించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ.. ముఖ్యమంత్రి మార్పు విధానాన్ని కొలిక్కి తెచ్చినట్లు సమాచారం.

పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి భూపేశ్‌ బఘేల్‌, టీఎస్​ సింగ్‌ దేవ్‌ సమ్మతించినట్లు.. రాహుల్‌తో భేటీ(rahul gandhi news) అనంతరం ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ పీఎల్ పునియా వెల్లడించారు. ఈ ప్రకటనను ఇద్దరు నేతలు సైతం ధ్రువీకరించారు.

2018 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకునే విధంగా భూపేశ్‌ బఘేల్‌, సింగ్‌ దేవ్‌ మధ్య అవగాహన కుదిరింది. దీని ప్రకారం ఈ ఏడాది జూన్‌ 17 నాటికే బఘేల్‌ పదవి నుంచి వైదొలిగి సింగ్‌ దేవ్‌కు ముఖ్యమంత్రి బాధ్యతల్ని అప్పగించాల్సి ఉంది.

ఇదీ చదవండి:'ప్రైవేటీకరణతో ఉద్యోగాలు మాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.