ఎయిర్ విస్తారా యూకే-781 విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఈ విమానానికి హైడ్రాలిక్ సమస్య తలెత్తింది. అప్రమత్తమైన డీజీసీఏ విమానానికి అత్యవసర పరిస్థితి ప్రకటించింది.దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం విమానం అత్యవసరంగా ల్యాండ్ అవ్వాలని ఆదేశాలు జారీ చేయగా.. వెంటనే దిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు పైలెట్లు. విమానంలో దాదాపు 140 మంది ప్రయాణికులు ఉన్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా దిగడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఎయిర్ విస్తారా విమానానికి అత్యవసర పరిస్థితి ప్రకటన.. సేఫ్‌గా ల్యాండింగ్
దిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్లే ఎయిర్ విస్తారా విమానానికి అత్యవసర పరిస్థితి ప్రకటించింది డీజీసీఏ. ఎయిర్ విస్తారా యూకే-781 విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తడం వల్ల అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతిచ్చింది.
ఎయిర్ విస్తారా యూకే-781 విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఈ విమానానికి హైడ్రాలిక్ సమస్య తలెత్తింది. అప్రమత్తమైన డీజీసీఏ విమానానికి అత్యవసర పరిస్థితి ప్రకటించింది.దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం విమానం అత్యవసరంగా ల్యాండ్ అవ్వాలని ఆదేశాలు జారీ చేయగా.. వెంటనే దిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు పైలెట్లు. విమానంలో దాదాపు 140 మంది ప్రయాణికులు ఉన్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా దిగడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
TAGGED:
delhi to bhubaneswar flight