రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా ముఖేశ్ అంబానీని విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఆహ్వానించాలన్న ప్రతిపాదనను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్‌యూ) విద్యార్థులు వ్యతిరేకించారు. ఈ మేరకు బీహెచ్‌యూలో మంగళవారం ఆందోళనలు చేపట్టారు. నీతా అంబానీకి బదులుగా.. మహిళా సాధికారతకు ఉదాహరణగా నిలిచిన వేరొకరిని ఆహ్వానించాలని డిమాండ్ చేశారు విద్యార్థుల సంఘం నేత శుభం తివారీ.
మరోవైపు, నీతా అంబానీని విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఆహ్వానించాలని యాజమాన్యానికి ప్రతిపాదన పంపించామని ప్రొ. నిధి శర్మ తెలిపారు. నీతా అంబానీ ఓ మహిళా పారిశ్రామిక వేత్త అని.. ఆమె అనుభవాల నుంచి విద్యార్థులు ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు.
ఇదీ చదవండి: 70 దేశాలకు 5.8కోట్ల భారత టీకాలు: మోదీ