ETV Bharat / bharat

మహిళ ముఖంపై బ్లేడుతో దాడి.. 118 కుట్లు.. రంగంలోకి సీఎం! - మహిళ 118 కుట్లు

Woman Attacked By Blade: ఓ మహిళతో కొంతమంది ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఆమె వారిని ఎదిరించి చెప్పుతో కొట్టింది. ఆ కోపంతో కాసేపటికే ఆ యువకులు ఆమె ముఖంపై దారుణంగా బ్లేడ్​తో దాడి చేశారు. దీంతో ఆమెకు 118 కుట్లు పడ్డాయి. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో జరిగింది.

Woman Attacked By Blade
Woman Attacked By Blade
author img

By

Published : Jun 12, 2022, 1:50 PM IST

Woman Attacked By Blade 118 Stitches: దేశంలో రోజురోజుకూ మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎంతమందిని అరెస్ట్​ చేసినా.. కొందరి ఆకతాయిల్లో మార్పు రావడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో ఓ మహిళతో కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా ఆమె ముఖంపై బ్లేడుతో దారుణంగా దాడికి పాల్పడ్డారు. డాక్టర్లు ఆమెకు చికిత్స అందించి 118 కుట్లు వేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది.. భోపాల్​కు చెందిన ఓ మహిళ తన భర్తతో బైక్​పై మార్కెట్​కు వెళ్లింది. అయితే మార్గమధ్యలో వాటర్​ బాటిల్​ కొనేందుకు భార్యాభర్తలిద్దరూ స్థానికంగా ఉన్న ఓ​ దుకాణానికి వెళ్లారు. ఆ సమయంలో కొందరు యువకులు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఏవో కామెంట్స్​ చేస్తూ ఈలలు వేశారు. దీంతో ఆమె వారిని ఎదిరించి చెప్పుతో కొట్టింది. ఒక్కసారిగా దుకాణంలో ఉన్నవారంతా గుమిగూడారు. ఆకతాయిలను చెదరగొట్టారు. ఆమె ఎదురు తిరిగిందనే కోపంతో కాసేపటికే మళ్లీ ఆ యువకులు వచ్చి వెనుక నుంచి ఆమె ముఖంపై పలుమార్లు బ్లేడుతో దాడి చేశారు.

దగ్గర్లోని వారు వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. డాక్టర్లు ఆమెకు 118 కుట్లు వేశారు. ప్ర‌స్తుతం ఆమె మాట్లాడటం లేదని, ఒక కన్ను పూర్తిగా తెరవలేక పోతోందని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మహిళను పరామర్శించేందుకు ఆమె ఇంటికి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం వెళ్లారు.

బాధితురాలిని పరామర్శిస్తున్న మధ్యప్రదేశ్​ సీఎం

ఇవీ చదవండి: భుజంపై మేనకోడలి మృతదేహం.. గుండెల నిండా దుఃఖం.. అంబులెన్స్​ లేక 5 కి.మీ. అలానే..

డ్రైవర్​ నిర్లక్ష్యం.. చిన్నారి తలమీదుగా దూసుకెళ్లిన కారు.. అక్కడికక్కడే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.