ETV Bharat / bharat

Bhopal Rally INDIA Alliance : 'ఇండియా' కూటమి భోపాల్​ ర్యాలీ రద్దు.. కారణం అదేనని బీజేపీ సెటైర్​! - ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశం

Bhopal Rally INDIA Alliance : వచ్చే నెలలో మధ్యప్రదేశ్​ రాజధాని భోపాల్​లో విపక్ష ఇండియా కూటమి తలపెట్టిన ర్యాలీ రద్దయింది. ఈ మేరకు ఆ రాష్ట్ర కాంగ్రెస్​ నేత కమల్​నాథ్​ తెలిపారు. అయితే సనాతన ధర్మంపై ఆ కూటమి నేత చేసిన వ్యాఖ్యల కారణంగానే ర్యాలీ రద్దు చేసుకున్నారని మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్ విమర్శించారు.

Bhopal Rally INDIA Alliance
Bhopal Rally INDIA Alliance
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 9:53 PM IST

Bhopal Rally INDIA Alliance : అక్టోబర్‌ తొలివారం భోపాల్‌లో ఇండియా కూటమి తలపెట్టిన ర్యాలీ రద్దయినట్లు మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ తెలిపారు. ఇటీవల దిల్లీలోని శరద్‌ పవార్‌ నివాసంలో జరిగిన కూటమి సమావేశంలో.. భోపాల్‌లో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, తాజాగా ఈ ర్యాలీ ఎప్పుడంటూ పాత్రికేయులు ప్రశ్నించగా.. అది రద్దయినట్లు కమల్‌నాథ్‌ తెలిపారు. మరోవైపు ఇండియా కూటమి ర్యాలీపై తమ పార్టీ అధ్యక్షుడు ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణదీప్‌సింగ్‌ సూర్జేవాలా తెలిపారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే తెలియజేస్తామని చెప్పారు.

బీజేపీ సెటైర్లు
మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ దీనిపై స్పందించారు. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో.. ఇండియా కూటమి భోపాల్‌ ర్యాలీని రద్దు చేసుకుందని విమర్శించారు. సనాతన ధర్మాన్ని అవమానపరిచే వ్యాఖ్యలను మధ్యప్రదేశ్‌ ప్రజలు సహించరని అన్నారు. ఇప్పటికైనా ఇండియా కూటమి నేతలు వాస్తవాన్ని గ్రహించాలని గ్రహించాలని సీఎం చౌహాన్‌ హితవు పలికారు.

గత బుధవారం (2023 సెప్టెంబర్ 13న) విపక్ష ఇండియా కూటమి సమన్వయ కమిటీ (INDIA Alliance Coordination Committee) సమావేశం ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ దిల్లీ నివాసంలో నిర్వహించారు. ఈ మీటింగ్​లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కూటమి తరఫున భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే భోపాల్​ ర్యాలీ నిర్వహించాలని.. తొలి సభను అక్టోబర్​ తొలి వారంలో ఇక్కడే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

INDIA Alliance Parties Seat Sharing : సమన్వయ కమిటీ భేటీ అనంతరం ధరల పెరుగుదల, నిరుద్యోగం, బీజేపీ సర్కారు అవినీతిపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు ఉమ్మడి ప్రకటనలో కమిటీ నేతలు తెలిపారు. కులగణన వ్యవహారాన్ని సైతం ప్రస్తావించాలని సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. దీంతో పాటు 'ఇండియా' పార్టీల మధ్య సీట్ల పంపకం ప్రక్రియ ప్రారంభించాలని ఆ కూటమి సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. కూటమిలోని పార్టీలు దీనిపై చర్చలు జరుపుతాయని తెలిపారు. వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయానికి వస్తాయని స్పష్టం చేశారు.

Opposition Party Meeting : విపక్ష కూటమి నాలుగో సమావేశానికి వేదిక ఖరారు.. నేతలంతా కలిసి భారీ ర్యాలీ!

'ప్రజాస్వామ్యం ఖూనీకి వారి ప్రయత్నాలు.. అదానీ వ్యవహారంపై విపక్షాల ఐక్య పోరాటం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.