ETV Bharat / bharat

స్పెల్లింగ్ తప్పు చెప్పిందని బాలికను చితకబాదిన టీచర్​.. చిన్నారి చేయి ఫ్రాక్చర్​.. - madyapradesh latest news

ఐదేళ్ల బాలికపై ఓ ట్యూషన్ టీచర్ దారుణంగా ప్రవర్తించాడు. స్పెల్లింగ్ సరిగ్గా చెప్పలేదని బాలికను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె చేయి విరిగింది. మధ్యప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

Teacher broke 5 year old hand in bhopal
హోం టీచర్ అరెస్టు
author img

By

Published : Dec 29, 2022, 10:47 AM IST

Updated : Dec 29, 2022, 7:05 PM IST

మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఐదేళ్ల బాలికపై ఓ ట్యూషన్ టీచర్ దురుసుగా ప్రవర్తించాడు. తాను అడిగిన PARROT పదానికి స్పెల్లింగ్ సరిగ్గా చెప్పలేదని బాలికను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె చేయి విరిగింది. బాలిక మేనమామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసు వివరాల ప్రకారం..
జిల్లాలోని హబీబ్​గంజ్ పోలీస్​స్టేషన్​ పరిధిలో నివసిస్తున్న బాధిత బాలిక.. స్థానిక ప్రైవేట్​ స్కూల్​లో ఒకటో తరగతి చదువుతోంది. ఆమెకు ట్యూషన్​ చెప్పడానికి ప్రయాగ్​ విశ్వకర్మ ఇంటికి వస్తుంటాడు. ఆ విధంగానే మంగళవారం సాయంత్రం కూడా వచ్చాడు. ట్యూషన్​ చెబుతున్న సమయంలో అతడి అడిగిన పదం స్పెల్లింగ్.. బాలిక సరిగ్గా చెప్పలేదు. దీంతో కోపం పెంచుకున్న అతడు.. బాలికను గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె చేయి విరిగింది. నొప్పితో చిన్నారి గట్టిగా కేకలు పెట్టి ఏడ్చింది. అది విన్న చుట్టుపక్క వాళ్లంతా వచ్చారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
బాలిక మేనమామ.. ట్యూషన్​ టీచర్​పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రయాగ్​ను పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత నోటీసులపై విడుదల చేశారు.

Last Updated : Dec 29, 2022, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.