ETV Bharat / bharat

సంభోగానికి నిరాకరించిన వృద్ధుడి దారుణ హత్య - Periyakulam crime news

తమిళనాడులో దారుణం జరిగింది. థేనీ జిల్లాలో ఓ యువకుడు.. తాగిన మత్తులో వృద్ధుడ్ని గొంతుకోసి హత్య చేశాడు. తనతో సంభోగంలో పాల్గొనలేదనే కారణంగా ఈ దురాగతానికి ఒడిగాట్టాడని పోలీసు విచారణలో తెలిసింది.

Youngster killed 75 Years old homosexual partner for avoiding him in Tamilanadu
సంభోగానికి నిరాకరించినందుకు వృద్ధుడి దారుణ హత్య
author img

By

Published : Dec 20, 2020, 4:54 PM IST

తమిళనాడు థేనీ జిల్లాలో దారుణ ఘటన బయటపడింది. తనతో సంభోగానికి నిరాకరించాడని ఓ వృద్ధుడ్ని కిరాతకంగా హతమార్చాడో స్వలింగ సంపర్కుడు.

ఇదీ జరిగింది..

పెరియాకుళంకు చెందిన పొన్నారామ్​(75) ఇటీవల మంచంపై శవమై కనిపించాడు. తన తండ్రి మరణంపై అనుమానం వ్యక్తం చేసిన కూతురు మరియమ్మల్​.. స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో​ మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఎవరో గొంతుకోసి, హత్య చేసినట్టు తేలింది.

Youngster killed 75 Years old homosexual partner for avoiding him in Tamilanadu
నిందితుడు అరుణ్​ కుమార్​

పొన్నారామ్​ ఇంటికి తరచూ వెళ్తున్న అరుణ్​ కుమార్​(26)ను పోలీసులు విచారించారు. అరుణ్​, ఆ వృద్ధుడితో స్వలింగ సంపర్కం చేస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఓ వివాహానికి వెళ్లొచ్చిన అరుణ్.. పొన్నారామ్ ఇంటికి వచ్చి తనతో సంభోగం చేయమని బలవంతం చేశాడట. దీనికి ఆ వృద్ధుడు నిరాకరించినందున.. తాగిన మత్తులో అతడ్ని గొంతుకోసి చంపాడని వెల్లడైంది. ఈ ఘటనలో నిందితుడ్ని అరెస్ట్​ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరచిన అనంతరం జైలుకు పంపారు.

ఇదీ చదవండి: చిన్నారికి బిస్కెట్​ ఆశ చూపి మైనర్​ అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.