ETV Bharat / bharat

ఏం ఐడియా గురూ.. రోగులకు 'రోబో' చికిత్స! - మధ్యప్రదేశ్​ రోబో

కరోనా వైరస్​పై పోరాటంలో వైద్యులు చూపిన తెగువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైరస్​ సోకిన రోగిని కాపాడేందుకు తమ ప్రాణాలను కూడా లెక్కచేయలేదు. అందుకే అలాంటి వైద్యులను కాపాడేందుకు ఈ యువ శాస్త్రవేత్త ఓ రోబోను సృష్టించాడు. మరి ఆ రోబో ఏం చేస్తుంది? వైద్యులకు ఎలా సాయం చేస్తుంది. తెలుసుకోవాలంటే చదివేయండి మరి.

Young scientist
రోగులకు 'రోబో' చికిత్స
author img

By

Published : Feb 4, 2021, 6:57 PM IST

హిందూ ఈశ్వరుడికే మొక్కుతాడు, ముస్లిం అల్లానే కొలుస్తాడు, క్రిస్టియన్ జీసస్​నే నమ్ముతాడు. కానీ మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించే మరో దేవుడు వైద్యుడు. కరోనా సమయంలో ఇది మరోసారి రుజువైంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ ఎంతోమంది వైద్యులు కొవిడ్​ బారిన పడ్డారు. కొంతమంది ప్రాణాలూ కోల్పోయారు. ఇలాంటి ఘటనలు చూసి చలించిపోయాడు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ యువ శాస్త్రవేత్త. వైద్యుల ప్రాణాలు కాపడేందుకు ఓ రోబోను తయారు చేశాడు.

రోగులకు 'రోబో' చికిత్స

'డాక్టర్'​ రోబో..

కరోనా రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులకు బదులుగా రోబోలను పంపితే ఎలా ఉంటుందని ఆలోచించాడు జబల్​పుర్​కు చెందిన శాస్త్రవేత్త అభినవ్​ ఠాకూర్​. ఆ ఆలోచన నుంచి వచ్చిన అద్భుతమే ఈ రోబో.

ప్రత్యేకతలు..

  • ఈ రోబో చేతిలో ఓ ప్లేట్​ ఉంటుంది. ఇందులో రోగికి కావాల్సిన మందులు ఉంటాయి.
  • ఈ రోబోకు ఓ తెర కూడా ఉంది. ఇందులో నుంచి రోగి.. వైద్యుడిని చూడవచ్చు.
  • రోబోకు ఉన్న కెమోరా నుంచి రోగిని వైద్యుడు చూసేలా ఏర్పాటు చేశారు.
  • తన చేతిలో ఉన్న థర్మల్​ స్కానింగ్​ గన్​తో రోగి ఉష్ణోగ్రతను రోబోనే పరీక్షిస్తుంది.
  • ఈ రోబో వైఫై ద్వారా పని చేస్తోంది.

ప్రయోగాత్మకం..

ప్రస్తుతం అభినవ్​ ఈ రోబోను ఓ ప్రైవేట్​ ఆసుపత్రికి ఇచ్చాడు. అక్కడి వైద్యులు, ఆరోగ్య సిబ్పందికి ఇది ఎంతగానో సహాయపడుతోంది. ప్రస్తుతం ఇది ప్రయోగంలో ఉందని విజయవంతమైతే.. మరిన్ని రోబోలను తయారు చేస్తానని అభినవ్​ తెలిపాడు. అభినవ్​కు నూతన ఆవిష్కరణలు కొత్త కాదు. ఇంతకుముందు కూడా ఆయన రోగులకు మందులు ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేందుకు డ్రోన్లను కనిపెట్టాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.