ETV Bharat / bharat

టూరిస్టుగా వచ్చి మాతాజీగా మారి.. 40 ఏళ్లుగా గోసేవ - Cow bregade in india

ఆమె ఓ జర్మన్​ మహిళ. నలభై ఏళ్ల కిందట మన దేశానికి టూరిస్టులా వచ్చారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని నింపుకున్న భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ముగ్దురాలయ్యారు. భారత పౌరసత్వం తీసుకుని ఇక్కడే సుదేవీ మాతాజీగా మారి నాలుగు దశాబ్దాలుగా గోసంరక్షణ చేస్తూ విశిష్ట సేవలందిస్తున్నారు. ఆమెపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Young German girl to Sudevi Mataji; a journey of love with cows
టూరిస్టులా వచ్చింది... గోసంరక్షకురాలిగా మారింది
author img

By

Published : Oct 13, 2020, 1:40 PM IST

టూరిస్టులా వచ్చి 40 ఏళ్లుగా గోసంరక్షణ చేస్తూ..

భారతదేశానికి పర్యటకులుగా చాలా మంది విదేశీయులు వస్తుంటారు..పోతుంటారు. అలా వచ్చిన జర్మనీ మహిళే ఫ్రైడెరిక్ ఇరినా బ్రూనింగ్. నాలుగు దశాబ్దాల కిందట భారతదేశానికి వచ్చిన ఆమె దేశ సంస్కృతికి ఆకర్షితురాలు అయ్యారు. భారత పౌరసత్వం తీసుకుని ఇక్కడే సుదేవీ మాతాజీగా మారారు. మొదట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. తర్వాత కొన్ని సంవత్సరాలుగా గోసేవలో నిమగ్నమయ్యారు.

గోసంరక్షణకు లక్షలాది రూపాయిలు...

రోడ్డు ప్రమాదాల్లో గాయమైన ఆవులను చేరదీసి వాటికి చికిత్స చేయిస్తారు సుదేవీ మాతాజీ. అందుకోసం రాధా సురభి గోశాలను 1996లో ఉత్తర్​ప్రదేశ్​లోని మథురలో​ స్థాపించారు. గాయపడిన వేలాది గోవులను గోశాలకు తరలించి వైద్యం చేయిస్తున్నారు. ఇప్పటికీ 3 వేల గోవులు గోశాలలో ఉన్నాయి. వీటి నిర్వహణకు సుమారు 80 మంది పని చేస్తుంటారు. వారిలో కొందరు పశువైద్యులు కూడా ఉన్నారు.

Young German girl to Sudevi Mataji; a journey of love with cows
గోవుని ముద్దాడుతున్న సుదేవీ మాతాజీ

నాకు గోవులు అంటే చాలా ఇష్టం. అందుకే గోశాల స్థాపించాను. ఇవి(ఆవులు) కూడా మన కుటుంబ సభ్యుల లానే. వీటి నిర్వహణకు చాలా ఖర్చు అవుతోంది. కొంత విరాళాల రూపంలో నిధుల సమకూరుతున్నాయి. సొంత డబ్బు కూడా వెచ్చించాల్సి వస్తోంది

- సుదేవీ మాతాజీ

తల్లిదండ్రులకు 'నో' చెప్పాను...

సుదేవీ మాతాజీ.. అమ్మానాన్న జర్మనీలో ఉంటారు. వారికి ఒక్కగానోక్క కూతురు సుదేవీ. తండ్రి జర్మన్​ విదేశాంగ శాఖలో పని చేసేవారు. వారు ఎన్నో సార్లు ఆమెను జర్మనీకి తిరిగి రమ్మని చెప్పినా.. సుదేవీ రాను అని చెప్పారు. తన ఆనందం ఇక్కడే ఉందని సమాధానం ఇచ్చారు. తనకు వారి తల్లిదండ్రుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తోందని సుదేవీ మాతాజీ తెలిపారు.

పద్మశ్రీ

పద్మశ్రీ పురస్కారం...

దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన 'పద్మశ్రీ' అవార్డును 2019లో రాంనాథ్​ కోవింద్​ చేతుల మీదుగా సుదేవీ మాతాజీ అందుకున్నారు. గోసేవకు చేసిన కృషిని అభినందిస్తూ ప్రభుత్వం ఆమెను సత్కరించింది.

ఇదీ చూడండి: వీడియో: తల్లితో బుల్లి ఏనుగు సరదా ఆటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.