ETV Bharat / bharat

సింధియా అత్తలు చెప్పిన 'రాజమాత రక్తం' కథ ఇది...

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం పార్టీకి పెద్ద షాక్​. ఈ నేపథ్యంలో సింధియా అత్తలు వసుంధరా రాజే, యశోధర రాజే ఆయన నిర్ణయాన్ని స్వాగతించారు.

'Yashodhara Raje
సింధియా అత్తలు చెప్పిన 'రాజమాత రక్తం' కథ ఇది...
author img

By

Published : Mar 10, 2020, 5:15 PM IST

కాంగ్రెస్‌కు జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేయడాన్ని ఆయన అత్తలు వసుంధర రాజే, యశోధర రాజే స్వాగతించారు. ఆయన సొంత ఇంటికి తిరిగి వస్తున్నారని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే వ్యాఖ్యానించారు.

"నాకు చాలా ఆనందంగా ఉంది. సింధియాకు శుభాకాంక్షలు. ఇది ఆయన ఇంటికి తిరిగి రావడమే. మాధవరావు సింధియా తన రాజకీయ ప్రయాణాన్ని జన్​ సంఘ్​ నుంచే మొదలు పెట్టారు. జ్యోతిరాదిత్య సింధియాను కాంగ్రెస్​ పట్టించుకోలేదు."

- వసుంధర రాజే, రాజస్థాన్​ మాజీ ముఖ్యమంత్రి

సింధియా మరో అత్తయ్య అయిన భాజపా ఎమ్మెల్యే యశోధర రాజే ఆయన నిర్ణయాన్ని ప్రశంసించారు. దేశ ప్రయోజనాల కోసమే రాజమాత రక్తమైన సింధియా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు.

కాంగ్రెస్​ విమర్శలు

సింధియా పార్టీకి రాజీనామా చేయడాన్ని కాంగ్రెస్​ మోసపూరిత చర్యగా అభివర్ణించింది. ప్రజల విశ్వాసాన్ని, పార్టీ సిద్ధాంతాల్ని సింధియా తుంగలో తొక్కారని రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​ ఆరోపించారు.

"సింధియా లాంటి వ్యక్తులు అధికారం లేకపోతే ఉండలేరు. ఎప్పుడు అవకాశం వస్తుందా అని వేచి చూస్తారు. జాతీయ సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో సింధియా... భాజపాలో చేరుతున్నారంటేనే ఆయన అధికార దాహాన్ని అర్థం చేసుకోవచ్చు."

- అశోక్​ గహ్లోత్​, రాజస్థాన్​ సీఎం

భాజపా ఎదురుదాడి...

మధ్యప్రదేశ్​లో ప్రస్తుత పరిస్థితులపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ స్పందించారు. పార్టీని, ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేకే భాజపాపై కాంగ్రెస్​ విమర్శలు చేస్తోందని ఎదురుదాడికి దిగారు.

"సింధియా కాంగ్రెస్​లో ఉన్నప్పుడు వారికి ఆయన ఒక మహారాజులా కనిపించారు. ఇప్పుడు మాఫియా అంటున్నారు. ఇది వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం. కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని మేము కూల్చడం లేదు. వారే కూల్చుకుంటున్నారు."

- శివరాజ్​ సింగ్​ చౌహాన్​, మధ్యప్రదేశ్​ మాజీ సీఎం

లెక్కల చిక్కులు...

230 శాసనసభ స్థానాలు గల మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114, భాజపాకు 107 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్పీ శాసనసభ్యులు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒకరు కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు.

సింధియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే కమల్‌నాథ్‌ సర్కార్‌ కొనసాగడం కష్టమే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.