ETV Bharat / bharat

మత సామరస్యాన్ని చాటుతూ.. ముస్లిం యువతి యక్ష'గానం'..

యక్షగానం.. ఇతిహాసాల నేపథ్యాలను ప్రదర్శించే ప్రాచీన కళ. చాలా ఏళ్లుగా పురుషులదే ఇందులో ఆధిపత్యం. అయితే కళ అందరిదని, కులాలు, మతాలు, లింగబేధాలకు సంబంధం లేదని కర్ణాకటకు చెందిన ఓ ముస్లిం యువతి నిరూపిస్తోంది. ఇది భారతీయ సంస్కృతి అంటూ మహిషాసుర, బీజాసుర వంటి పాత్రలు మెప్పిస్తోంది.

Yakshagana performed by a Muslim girl in magalore karnataka
యక్షగానంలో మహిషాసురుడిగా ముస్లిం యువతి!
author img

By

Published : Sep 1, 2020, 10:38 AM IST

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కర్ణాటక జానపద 'యక్షగానం' కళను.. పురుషాధిక్య కళగా పేర్కొంటారు చాలామంది. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ఈ రోజుల్లోనూ.. యక్షగానంలో మాత్రం వారి సంఖ్య వేళ్లపై లెక్కపెట్టొచ్చు. అలాంటిది.. తొలిసారిగా ఓ ముస్లిం యువతి తన యక్షగాన ప్రదర్శనతో అబ్బురపరుస్తోంది.

దక్షిణ కర్ణాటక, ఒక్కెతూర్ మాడ గ్రామానికి చెందిన అర్షియా(20).. ముస్లిం కుటుంబంలో పుట్టిపెరిగింది. అయితేనేం, తానూ భారతమాత బిడ్డనే అంటోంది. మతబేధం మచ్చుకైనా లేకుండా, హిందూ ఇతిహాసలను ప్రదర్శించే జానపద కళ 'యక్షగాన' పట్ల ఇష్టం పెంచుకుంది. 10 ఏళ్ల వయసులో తన గ్రామంలో యక్షగాన ప్రసంగం చూసింది అర్షియా.. అప్పటి నుంచి ఏదో ఓ రోజు వేదికపై తానూ యక్షగాన ప్రదర్శనలివ్వాలని నిర్ణయించుకుంది.

మహిషాసురుడిగా ముస్లిం యువతి!

"నా బాల్యంలో మహిషాసురుడి పాత్ర యక్షగాన ప్రదర్శన చూశాను. అప్పటి నుంచే యక్షగానం అంటే ఎనలేని ఇష్టం పెరిగింది. ఎక్కడ ప్రదర్శన ఉన్నా చూస్తూ ఉండిపోయేదాన్ని. టీవీ, సీరియళ్లలో యక్షగాన కార్యక్రమాలు తప్పకుండా చూసేదాన్ని. అయితే, ఇందులో మతానికి సంబధం లేదు. ఇది కేవలం భారతీయ సంస్కృతికి సంబంధించినది మాత్రమే. అందుకే నేను నేర్చుకోవాలని నిర్ణయించుకున్నా. "

-అర్షియా

అర్షియా ఆసక్తిని గుర్తించి మంగళూరు కడలి కళా కేంద్రంలో.. యక్షగానం నేర్పించేందుకు అంగీకరించారు జయరాం మాస్టారు. కానీ, అందుకు అర్షియా బంధువులు ససేమీరా అన్నారు. ముస్లిం మతంలో పుట్టి హిందూ కళ ఎలా నేర్చుకుంటావని అడ్డుపడ్డారు. చాలా రోజుల పాటు పోరాడి ఎట్టకేలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో యక్షగానలో రంగప్రవేశం చేసింది అర్షియా.

Breaking through Yakshagana glass ceiling, this Muslim girl is to watch out for
మహిషాసురుడిగా అర్షియా

రంగస్థలంపై 'తనూ విట్లా'గా పేరు మార్చుకుని దూసుకుపోతోంది అర్షియా. మహిషాసుర, రక్త భీజాసుర, నిషుంభాసురుడి పాత్రల్లో అవలీలగా ఒదిగిపోతోంది.

ఇదీ చదవండి: మాతృభాషలో 8గంటలు అనర్గళంగా మాట్లాడతారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.