దేశంలో ఏదో చోట భారీఎత్తున మత్తుపదార్థాలు పట్టుబడిన వార్తలు రోజు వింటూనే ఉన్నాం. బంగారం, మాదకద్రవ్యాలు అక్రమంగా తరలించేందుకు వినూత్న పద్ధతులను ఎంచుకుంటున్నారు దుండగులు. తాజాగా కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయంలో కోటి రూపాయల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఎలక్ట్రిక్ మసాజ్ పరికరంలో అమర్చి తరలిస్తున్నట్లు తెలిపారు.
విమానాశ్రయంలోని అంతర్జాతీయ కొరియర్ కేంద్రంలో తనిఖీలు నిర్వహించగా.. మసాజ్ పరికరంలో అమర్చిన ఎండీఎంఏ ట్యాబ్లెట్లు దొరికాయని తెలిపారు అధికారులు. 1980 గ్రాములు ఉంటాయని, వాటి విలువ రూ.1 కోటి వరకు ఉంటుందని వెల్లడించారు. ఆ పార్శిల్ బెల్జియం నుంచి రాగా.. వాటిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: రూ.81 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలు పట్టివేత