నేటి యువతరం పుస్తకాలు చదివే అలవాటును పెంచుకోవాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. టెక్స్ట్, ట్వీట్, గూగుల్ గురు కాలంలో పుస్తకాల ద్వారా లభించే జ్ఞానాన్ని పొందేందుకు దూరం కాకూడదన్నారు. జైపుర్‌లోని పత్రికా గేట్ ప్రారంభోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ప్రధాని మోదీ. పత్రికా గ్రూప్ ఛైర్మన్ గులాబ్ కొఠారి రాసిన రెండు పుస్తకాలను విడుదల చేశారు.
అంతర్జాతీయంగా భారత్ బలమైన శక్తిగా ఉనికిని చాటుకుంటోంది. భారత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. ప్రపంచ దేశాల దృష్టి ఇప్పుడు భారత్‌పైనే ఉంది. భారతీయ మీడియా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించటంలో, ప్రభుత్వ పనులను పరిశీలించి వాటిలోని లోపాలను ఎత్తిచూపడంలో మీడియా అద్భుతమైన పనితీరును కనబరుస్తోందని కితాబిచ్చారు మోదీ. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల కాలంలో మీడియా కూడా విమర్శలు ఎదుర్కొంటోందని, విమర్శల నుంచి ప్రతిఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చూడండి: ఖాకీ దుస్తులను చూసి గర్వపడాలి: ప్రధాని మోదీ