ETV Bharat / bharat

కొవిడ్‌ గురించి తెలియాల్సింది కొండంత - antibodies treatment for covid

కరోనా నివారణకు చికిత్స తెలియకుండానే లాక్​డౌన్ సడలింపులపై నిర్ణయం తీసుకోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 'రోగనిరోధక శక్తి పాస్​పోర్టు' అంశంపై విస్తృత చర్చ జరుగుతున్నా.. ఈ ప్రతిపాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ తోసిపుచ్చింది. రోగనిరోధకాలపై గతంలో జరిగిన పరిశోధనలు ఏం తెలియజేస్తున్నాయో ఓ సారి పరిశీలిద్దాం.

world need to know much about covid-19
కొవిడ్‌ గురించి తెలియాల్సింది కొండంత
author img

By

Published : May 7, 2020, 7:49 AM IST

ప్రపంచంలోని అన్ని దేశాలూ లాక్‌డౌన్‌ ఎత్తివేతలు, సడలింపులపై దిశగా అడుగులు వేస్తున్నాయి. కొవిడ్‌-19 నుంచి కోలుకుని, యాంటీబాడీ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వారికి ‘రోగనిరోధక శక్తి పాస్‌పోర్టు’లు ఇవ్వాలనే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. వీరిని పనులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలనేది లక్ష్యం. అయితే శరీరంలో కరోనా ప్రతిరక్షక పదార్థాలు (యాంటీబాడీలు) ఉన్న వ్యక్తి మరోసారి ఈ వైరస్‌ బారిన పడకుండా ఉంటారా? అనే ప్రశ్నకు ఇంకా శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ కారణాలతోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పాస్‌పోర్టుల ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఈ వైరస్‌పై రోగనిరోధక శక్తి ప్రతిస్పందనలో ప్రత్యేకతలు ఏమిటి? ఈ ప్రతిస్పందన వ్యక్తుల్లో వ్యాధి తీవ్రతను ఎలా ప్రభావితం చేస్తుంది? రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటుంది? ఈ విషయాలు తెలియకుండా లాక్‌డౌన్‌ సడలింపులపై నిర్ణయం తీసుకోవడం సరికాదనే భావన వ్యక్తమవుతోంది.

రోగనిరోధక శక్తి కీలకం..

ఎవరైనా వ్యాధుల బారిన పడితే వారి రోగనిరోధక వ్యవస్థ తొలి స్పందన... మాక్రోపేజెస్‌ అనే తెల్ల రక్తకణాలను సమీకరించడం. ఇవి వైరస్‌ని చుట్టుముట్టి దాన్ని తుదముట్టించడానికి ప్రయత్నిస్తాయి. ఇన్‌ఫెక్షన్‌ సోకిన 5 నుంచి 10 రోజులు ద్విముఖంగా ఈ పని జరుగుతుంది. ఒకవైపు బి-తెల్ల రక్తకణాల (లింపోసైట్స్‌) నుంచి యాంటీబాడీ(ప్రత్యేక ప్రొటీన్‌)ల ఉత్పత్తి జరుగుతుంది. ఇవి వైరస్‌ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాయి. కొన్ని తటస్థ యాంటీబాడీలు వైరస్‌ల పనులను అడ్డుకుని వాటి ప్రభావాన్ని నివారిస్తూనే నాశనం చేసేందుకూ యత్నిస్తాయి. మరోవైపు టి-తెల్ల రక్తకణాలు వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురైన కణాలను గుర్తించి నాశనం చేస్తాయి. మాక్రోపేజెస్‌, బి, టి-కణాల సంయుక్త కృషి తగినంతగా ఉంటే వ్యాధికారకాలు తోకముడిచి శరీరంలో లేకుండా పోతాయి. ఒకసారి ఇది జరిగితే ఈ ప్రక్రియకు సంబంధించిన జ్ఞాపకశక్తి బి, టి-కణాల్లో ఏర్పడి మళ్లీ ఎప్పుడైనా ఈ వైరస్‌లు శరీరంలోకి ప్రవేశిస్తే ప్రతిస్పందించడానికి రోగనిరోధక శక్తికి సాయపడతాయి. కణాల్లో ఈ జ్ఞాపకశక్తి ఎంతకాలం ఉంటుందనేది వైరస్‌ల మీదే ఆధారపడుతుంది. ఉదాహరణకు మీజిల్స్‌కు సంబంధించిన రక్షణ జీవిత కాలంపాటు, ఇన్‌ఫ్లూయంజాలో 6నెలలపాటు ఉంటుంది. సార్స్‌-కోవ్‌-2లో ఎంతకాలమనేది ప్రస్తుతానికి తెలియదు. అయితే కొన్ని క్లూలు దొరికాయి. ఒకటి... సార్స్‌, మెర్స్‌లతో సార్స్‌-కోవ్‌-2కి దగ్గరి సంబంధం ఉండడం. గతంలో సార్స్‌ సోకినవారిలో రెండేళ్లపాటు, మెర్స్‌ బాధితుల్లో మూడేళ్లపాటు ఈ యాంటీబాడీలు ఉన్నాయి. మరోటి... ‘హ్యూమన్‌ కరోనా వైరస్‌ 229ఈ’ నుంచి లభించింది. ‘229ఈ’ ప్రమాదకరం కాదు. ఇది కేవలం మనుషుల్లో జలుబుకి మాత్రమే కారణమవుతుంది. ఇది కూడా కరోనా వైరస్‌లపై మనుషుల్లో రోగనిరోధక శక్తి ప్రతిస్పందనలను తెలియజేస్తోంది.

1970ల్లో జరిగిన పరిశోధనల్లో ‘229ఈ’తో ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారిలో ఏడాది కంటే తక్కువ సమయమే ఈ యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు. 1990ల్లో జరిగిన పరిశోధనల్లో ఏడాది తర్వాత ఈ వైరస్‌ తిరిగి సోకిన వారిలో వ్యాధి లక్షణాలు చాలా తక్కువ కనిపించినట్లు చెబుతున్నారు. దీన్నిబట్టి శరీరంలో యాంటీబాడీలు లేకుంటే వారిలో వ్యాధి నిరోధక రక్షణ లేదని అర్థం కాదని తేలుతోంది. ఇదే విధానం సార్స్‌-కోవ్‌-2కి కూడా వర్తించవచ్చని షాంఘైలో నిర్వహించిన పరిశోధన చెబుతోంది. వీరు కొవిడ్‌-19కి గురైన 175 మంది వ్యక్తుల రక్తనమూనాలను పరిశీలించారు. వీరిలో చాలామందిలో వ్యాధి మొదలైన 10-15 రోజుల్లో తటస్థ యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. వీటి ఉత్పత్తిలో వ్యక్తులకు వ్యక్తులకు మధ్య చాలా తేడా ఉండగా.. ఆశ్చర్యకరంగా 10 మంది రక్తనమూనాల్లో ఎప్పుడూ గుర్తించదగిన యాంటీబాడీలు కనిపించలేదు. అయినప్పటికీ వీరు కోలుకున్నారు. టి-కణాల వంటి ఇతర నిరోధకశక్తి విభాగాల ప్రతిస్పందన వీరిలో కీలకమవుతుందని ఇది సూచిస్తోంది. మరోసారి బాధితులపై ఈ వైరస్‌ దాడి చేస్తే వారిలో యాంటీబాడీలు లేకున్నా.. ఈ నిరోధక శక్తి వైరస్‌ని అడ్డుకుంటుంది. అంటే యాంటీబాడీ- ఆధారిత రోగనిరోధక శక్తి పాస్‌పోర్టులను ఇలాంటి వారు పొందలేరు. ఫలితంగా వీరిలో నిరోధక శక్తి ఉన్నా వీరు లాక్‌డౌన్‌ని తప్పించుకోలేరు. ఇంకా కీలకమైన అభ్యంతరం ఏమంటే.. ఒకవేళ యాంటీబాడీ రక్షణ నిజమైనా.. ఈ పరీక్షలు ఇప్పటికీ నమ్మదగినవిగా నిరూపణ కాలేదు. అలానే ఆ యాంటీబాడీలు తటస్థమైనవా? కావా? అనే తేడా కూడా తెలియదు.

ఇదీ చూడండి: శానిటైజర్ల ఎగుమతిపై నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.