ETV Bharat / bharat

మహిళా దినోత్సవం సందర్భంగా అతివలకు ఉచిత టీ - Maharashtra news

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ నేపథ్యంలో తన దుకాణానికి వచ్చే మహిళలకు ఉచిత టీ అందించాలని నిర్ణయం తీసుకున్నాడు ఆ యజమాని. దుకాణం వద్ద మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ బ్యానర్​ ఏర్పాటు చేశాడు. మహిళలందరికీ టీ ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నాడు.

womens day
మహిళా దినోత్సవం సందర్భంగా అతివలకు ఉచిత టీ
author img

By

Published : Mar 8, 2020, 10:41 AM IST

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవాళి మనుగడలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళాలోకాన్ని ఈ సందర్భంగా యావత్​ ప్రపంచం కీర్తిస్తోంది. ఈ నేపథ్యంలో తన సామర్థ్యం మేరకు అతివలకు కృతజ్ఞతలు తెలపాలని అనుకున్నాడు ఓ టీ స్టాల్ యజమాని. మహిళా దినోత్సవం సందర్భంగా ఉచితంగా టీ అందిస్తున్నాడు.

ముంబయికి చెందిన మనోజ్ ఠాకూర్ నగరంలోని ఓ ప్రాంతంలో టీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అతివల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఈ మేరకు తన టీ స్టాల్ వద్ద మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ బ్యానర్ ఏర్పాటు చేశాడు. ఉచితంగా టీ అందిస్తున్నాడు.

"గత 15 ఏళ్ల నుంచి నేను టీ అమ్ముతున్నాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అనుకున్నాను. నా టీ స్టాల్​కు మహిళలు ఎక్కువగా వస్తుంటారు. అందుకే ఇలా టీ అందించాలని నిర్ణయించుకున్నా. మన ప్రధాని కూడా ఒకప్పుడు టీ అమ్మేవారు. ఆయనే నాకు స్ఫూర్తి. ఏ పనీ చిన్నది కాదు."

-మనోజ్ ఠాకూర్, టీ స్టాల్ యజమాని

ఇదీ చూడండి: ఉమెన్స్​ డే ప్రత్యేకం​: ఆ విమానంలో సిబ్బందంతా మహిళలే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.