దేశంలోని ప్రతి రంగంలో పురుషులతో సమానంగా మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే సైన్యంలో చేరేందుకు అంతగా ఉత్సుకత చూపించడం లేదు. ఈ నేపథ్యంలోనే భారత సైన్యంలో మహిళలు చేరే విధంగా ప్రోత్సహించేందుకు మహిళా సీఆర్పీఎఫ్ జవాన్లు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
సుమారు 50 మంది మహిళా జవాన్లతో మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా.. గుజరాత్లోని కెవాడియా కాలనీ నుంచి ముంబయి వరకు సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. మహిళలు త్రివిధ దళాల్లో చేరాలని ప్రోత్సహిస్తున్నారు.