ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు మహిళలు, భారత జవాన్లకు రాఖీలు కట్టారు. సోమవారం రక్షాబంధన్ సందర్భంగా ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ మంత్రి జితేంద్రసింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కశ్మీర్, లద్దాఖ్‌లో మోహరించిన సాయుధ, పారామిలటరీ బలగాల జవాన్లతో రక్షాబంధన్ వేడుకలను జరుపుకొన్నారు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక బృంద మహిళలు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి జితేంద్రసింగ్ పాల్గొన్నారు. ఈశాన్య ప్రాంతాల స్వయం సహాయక సంఘాల మహిళల ప్రతిభ, నిబద్ధతలను ప్రశంసించారు మంత్రి.
ఇదీ చదవండి: అన్నయ్య చేతికి మాస్క్, శానిటైజర్ల రాఖీ కట్టేయండి!