బిహార్లో వరద బీభత్సం కొనసాగుతోంది. ముఖ్యంగా తూర్పు చంపారన్ జిల్లాలో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని, పడవలే ఆధారమయ్యాయి. ఈ క్రమంలో గోబరి గ్రామానికి చెందిన ఓ మహిళకు ప్రసవ వేధన ప్రారంభమైంది. ఆమెను మోటారు బోటులో ఆసుపత్రికి తరలిస్తుండగా... అందులోనే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.
రిమా ప్రసవ వేధన తీవ్రమవడం వల్ల జాతీయ విపత్తు నిర్వహణ దళానికి(ఎన్డీఆర్ఎఫ్) సమాచారం అందించారు స్థానికులు. దీంతో వైద్య సిబ్బందితో సహా ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనాస్థలానికి చేరుకుంది. అక్కడ తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆ నిండు గర్భిణీని మోటారు బోటులో ఆసుపత్రికి తరలించడానికి నిర్ణయించింది. కానీ మార్గం మధ్యలోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
ఇదీ చూడండి: దేశంలో కొత్తగా 49,931 కేసులు.. 708 మరణాలు