ETV Bharat / bharat

ఆ​ గ్రామంలో పంచాయతీ పెద్ద​గా పాకిస్థాన్​ మహిళ! - పాక్​ మహిళ బానో బేగం

భారతీయ పౌరసత్వం లేనప్పటికీ ఓ పాకిస్థానీ మహిళ.. ఏకంగా గ్రామ పంచాయతీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఈ ఘటన.. ఓ స్థానిక వ్యక్తి ఫిర్యాదుతో బయటపడింది.

Woman village head in UP found to be Pak national
ఉత్తర్​ప్రదేశ్​లో​ గ్రామ పంచాయతీ అధికారిగా పాక్​ మహిళ!
author img

By

Published : Jan 4, 2021, 5:20 AM IST

పాకిస్థాన్​కు చెందిన ఓ మహిళ భారత్​లో గ్రామ పంచాయతీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. మూడు దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్న బానో బేగం(65).. భారత పౌరసత్వం లేకపోయినప్పటికీ ఓ గ్రామ పంచాయతీకి ఎన్నికవ్వడం పలు సందేహాలను రేకెత్తిస్తోంది.

బానో బేగంకు చెందిన దీర్ఘకాలిక వీసా చెల్లుబాటులో ఉన్నప్పట్టికీ.. తప్పుడు సమాచారం ఆధారంగా చట్టవిరుద్ధంగా రేషన్​, ఆధార్​ గుర్తింపు కార్డులను పొందినట్టు తెలుస్తోంది. యూపీలోని జలేసర్​​కు చెందిన గుడావ్​ అనే గ్రామ పంచాయతీ అధ్యక్షులు షహనాజ్​ బేగం ఇటీవలే మృతిచెందగా.. ఆమె స్థానంలో బానో ఎంపికయ్యారు. 2015లోనే పంచాయతీ సభ్యురాలిగా ఆమె ఎన్నికయ్యారు.

ఈ విషయమై స్థానిక వ్యక్తి ఒకరు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ నేపథ్యంలో గత డిసెంబర్​లోనే తన పదవికి రాజీనామా చేశారు బేగం. 35 ఏళ్ల క్రితమే అష్రత్​ అలీతో ఆమెకు వివాహమైనా.. ఇప్పటివరకు ఆమె దేశ పౌరసత్వం పొందలేదని స్థానిక పోలీసులు తెలిపారు.

ఈ పూర్తి వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెకు రేషన్​ కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డు ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: 'తొలిసారి అహంకార ప్రభుత్వం రాజ్యమేలుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.