తనపై జరిగిన అత్యాచారాన్ని ఫిర్యాదు చేసేందుకు భారత్‌లో నివాసముంటున్న ఓ నేపాలీ మహిళ.. 800 కిలోమీటర్లు ప్రయాణించింది. ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు వెళ్లి కేసు వేసింది. అసలు ఆ మహిళ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది?
అసలేం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం.. ఉద్యోగం కోసం 2018లో భారత్‌కు వచ్చింది ఆ మహిళ. ఈ ఏడాది మార్చి నుంచి తన స్నేహితురాలితో కలిసి లఖ్‌నవూ ఫైజాబాద్ రోడ్డులో నివాసముంటోంది. అప్పుడే.. ఆ స్నేహితురాలి ద్వారా ప్రవీణ్ రాజ్‌పాల్ అనే వ్యక్తి ఆ 22ఏళ్ల మహిళకు పరిచయమయ్యాడు. అతడు దుబాయ్‌లో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్.
తన స్నేహితురాలి వద్ద రూ. 1.5లక్షలు దాచింది ఆ మహిళ. కొద్ది రోజుల అనంతరం తిరిగి అడగ్గా.. ఆమె ఇవ్వలేదు. దానికి తోడు ఆ మహిళను కొట్టడం, హింసించడం మొదలు పెట్టింది. ఇదే విషయాన్ని యాదవ్‌కు తెలియజేసింది ఆ మహిళ. వెంటనే లఖ్‌నవూలోని ఓ హోటల్లో గదిని బుక్ చేసి అక్కడికి మారమని చెప్పాడు యాదవ్.
ఇదీ చూడండి:- 'హాథ్రస్'పై పోలీసులకు షాక్.. అత్యాచారం జరిగినట్లు రిపోర్ట్!
కొన్ని రోజుల అనంతరం దుబాయ్ నుంచి వచ్చిన యాదవ్.. హోటల్‌కు వెళ్లాడు. ఆమెకు మత్తుమందులు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. దీనితో పాటు బాధితురాలిని అసభ్యకర రీతిలో ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత.. మళ్లీ తన స్నేహితురాలి ఇంటికి తీసికెళ్లి, అక్కడ కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు.
అక్కడితో ఆగకుండా.. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు నిందితుడు. పోలీసులను సంప్రదిస్తే.. ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించాడు.
అయితే అక్కడి నుంచి తప్పించుకున్న ఆ మహిళ... నాగ్‌పుర్‌లోని తన నేపాలీ స్నేహితురాలి వద్దకు గత నెల 30న చేరుకుంది. ఆమె సహాయంతో కోరాడి పోలీస్ స్టేషన్లో లఖ్‌నవూలోని స్నేహితురాలు, యాదవ్‌పై ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సదరు జీరో ఎఫ్ఐఆర్ కాగితాలను లఖ్‌నవూలోని చినాహట్ పోలీసులకు అందివ్వడానికి మహిళతో సహా ఆదివారం బయలుదేరినట్టు అధికారులు తెలిపారు.
నేరం ఎక్కడ జరిగినా... దేశంలోని ఏ పోలీస్ స్టేషన్లో అయినా 'జీరో ఎఫ్ఐఆర్' నమోదు చేయవచ్చు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు దానిని బదిలీ చేయవచ్చు.
ఇదీ చూడండి:- ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు.. జీరో ఎఫ్ఐఆర్ ఉందిగా..!