ETV Bharat / bharat

కదులుతున్న కారులో అత్యాచారం- ఆపై బయటికి తోసేసి.. - ఉన్నావ్ అత్యాచార కేసు

ఉత్తర్​ప్రదేశ్​లో మహిళలపై నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఉన్నావ్​ జిల్లాలో 'నిర్భయ' తరహా ఘటన జరిగింది. ఆగ్రా ఎక్స్​ప్రెస్​ వే పై కదులుతున్న కారులో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆమె స్నేహితులు. అనంతరం కారులోనుంచి తోసేశారు.

gangrape
అత్యాచారం
author img

By

Published : Oct 9, 2020, 10:31 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​లో 'నిర్భయ' తరహా ఘటన జరిగింది. ఆగ్రా ఎక్స్​ప్రెస్​ వేలో కదులుతున్న కారులో ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు మృగాళ్లు. యువతి మరణించినట్లు భావించి కారులో నుంచి తోసేశారు.

ఎక్స్​ప్రెస్​ వేపై యువతిని గుర్తించిన యూపీఈఐడీఏ సిబ్బంది బెహట్​ ముజావర్​ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.

స్నేహితుడే!

ఆమె స్నేహితుడు, అతని మిత్రులు కలిసి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. లఖ్​నవూ నుంచి బాంగ్రామవూకు మోసపూరితంగా తీసుకొచ్చినట్లు తెలిపింది. ఆమె ముఖంపై పళ్లతో చేసిన తీవ్రమైన గాయమున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: భార్య తల నరికి పోలీస్ స్టేషన్​కు పట్టుకెళ్లిన భర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.